క్రీడాభూమి

ఐసిసి మహిళల క్రికెట్ జట్టులో మందనాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 14: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన మహిళల క్రికెట్ జట్టులో భారత్ నుంచి స్మృతి మందనాకు చోటు దక్కంది. కాగా, ఉమెన్స్ వనే్డ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వెస్టిండీస్‌కు చెందిన స్ట్ఫోనీ టేలర్‌కు లభించింది. ఐసిసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారితో కూడిన పురుషులు, మహిళల జట్లను ఐసిసి ప్రతి ఏటా ప్రకటిస్తుంది. ఈసారి ఐసిసి మహిళల జట్టులో న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు చెందిన ఇద్దరేసి క్రీడాకారిణులకు స్థానం లభించింది. భారత్, దక్షిణాఫ్రికా నుంచి ఒక్కొక్కరు ఈ జట్టులో ఉన్నారు. 12వ క్రీడాకారిణిగా ఐర్లాండ్‌కు చెందిన కిమ్ గార్త్ ఎంపికైంది.
ఐసిసి ఈఏటి మహిళల జట్టు: సూజీ బేట్స్, రాచెల్ ప్రీస్ట్, లీ కస్పెరెక్ (న్యూజిలాండ్), మెగ్ లానింగ్, ఎలిస్ పెర్సీ (ఆస్ట్రేలియా), హీతర్ నైట్, అన్యా షబ్‌స్రోల్ (ఇంగ్లాండ్), స్ట్ఫోనీ టేలర్, దియేంద్ర డోటిన్ (వెస్టిండీస్), సనే లుస్ (దక్షిణాఫ్రికా), స్మృతి మందానా (్భరత్). 12వ క్రీడాకారిణి కిమ్ గార్త్ (ఐర్లాండ్).