క్రీడాభూమి

జూ. ప్రపంచ కప్ సెమీస్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 15: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పటిష్టమైన స్పెయిన్‌తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక గోల్ చేసి, భారత్‌ను విజయపథంలో నడిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్పెయిన్‌కు 22వ నిమిషంలో గోల్ లభించింది. మార్క్ సెరాహిమా చక్కటి ఫీల్డ్ గోల్‌ను నమోదు చేశాడు. ఆతర్వాత స్పెయిన్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, ఈక్వెలైజర్ కోసం భారత్ విశ్వప్రయత్నాలు చేసింది. చివరికి 57వ నిమిషంలో ఆ ప్రయత్నాలు ఫలించాయి. సమ్రన్‌జిత్ సింగ్ మాన్ గోల్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. స్కోర్లు సమమైన వెంటనే వేగాన్ని పెంచిన భారత్‌కు హర్మన్‌ప్రీత్ 66వ నిమిషంలో గోల్‌ను అందించాడు. అనంతరం మరో గోల్ నమోదుకాకపోవడంతో, భారత్ విజయభేరి మోగించి, శుక్రవారం ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌ని ఖాయం చేసుకుంది.
క్రీడాకారులకు ఫైన్!
సమయపాలన చేయని ఆటగాళ్లను దండించడానికి భారత హాకీ కోచ్ రొలాంట్ ఆల్ట్‌మన్స్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రాక్టీస్ సెషన్‌కు ఎవరైనా ఆలస్యంగా వస్తే, 500 రూపాయలు ఫైన్ చెల్లించాలని షరతు విధించాడు. ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని, సమయ పాలన ఎంతో ముఖ్యమని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే, ఫైనల్ వసూలు చేస్తానని అన్నాడు.