క్రీడాభూమి

సూపర్ నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, నవంబర్ 29: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్‌కు ఎందుకు విపరీతమైన క్రేజ్ ఉందో చెప్పడానికి స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ సోసిడాడ్‌తో జరిగిన మ్యాచ్ స్పష్టం చేసింది. రెండు గోల్స్ సాధించిన అతను బార్సిలోనా 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాడు. మ్యాచ్ 22వ నిమిషంలో అతను కొట్టిన ఫ్లయింగ్ కిక్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గాల్లోనే బంతిని అందిపుచ్చుకొని దానిని గోల్ పోస్టులోకి పంపిన విధానం అతని ప్రతిభకు నిదర్శనం. 41వ నిమిషంలో లూయిస్ సౌరెజ్ ఒక గోల్ చేయగా, 53వ నిమిషంలో నేమార్ మరో గోల్‌ను నమోదు చేశాడు. ఇంజురీ టైమ్ మొదటి నిమిషంలో లియోనెల్ మెస్సీ చేసిన గోల్‌తో బార్సిలోనా తిరుగులేని ఆధిక్యంతో విజయభేరి మోగించింది. బార్సిలోనా వ్యూహాత్మక ఆటకు సోసిడాడ్ నుంచి ఏ దశలోనూ గట్టిపోటీ ఎదురుకాలేదు. కాగా, ఇతర మ్యాచ్‌ల్లో అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో ఎస్పానిల్‌పై గెలవగా, డిపోర్టివో లా కొరునా 2-0 ఆధిక్యంతో లాస్ పల్మాస్‌ను ఓడించింది. సెల్టా విగో 2-1 స్కోరుతో సోర్టినా గిజాన్‌పై విజయం సాధించింది. మలగా, గ్రెనెడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి.