క్రీడాభూమి

ప్రమాదంలో క్విటోవా కెరీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేగ్, డిసెంబర్ 21: ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో గాయపడిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా కెరీర్ ప్రమాదంలో పడింది. ఆమె టెన్నిస్ ఆడే ఎడమ చేతికి బలమైన గాయాలు కావడంతో, భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళన అభిమానులను వెంటాడుతున్నది. కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఎడమచేతి వాటం ప్లేయర్ క్విటోవా 2011, 2014 సంవత్సరాల్లో వింబుల్డన్ టైటిళ్లను కైవసం చేసుకుంది. కాలి కండరాలు బెణకడంతో ఆమె వచ్చేనెల జరిగే హాప్‌మన్ కప్ మిక్స్‌డ్ టీం ఈవెంట్ నుంచి వైదొలగి, తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నది. దొంగతనానికి వచ్చినట్టు అనుమానిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడడంతో ఆమె గాయపడిన విషయం తెలిసిందే. ఆమె తనను తాను రక్షించుకోవడానికి చేతులు అడ్డం పెట్డంతో గాయాలు బంగా తగిలాయ. కండరాలతోపాటు నరాలు కూడా తెగిపోయినట్టు గుర్తించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నానని క్విటోపే ట్వీట్ చేసింది. ఆత్మ రక్షణకు ప్రయత్నించడంతో చేతికి కత్తిపోట్లు తగిలాయని పేర్కొంది. తన ప్రాణాలు పోనందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని తెలిపింది. ఇలావుంటే, గాయం కారణంగా ఆమె వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో పోటీపడే అవకాశాన్ని కోల్పోనుంది. సీజన్ మొత్తంలోనూ ఆమె ఎక్కువ టోర్నీలు లేదా సిరీస్‌ల్లో పాల్గొనడం కష్టమని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే, త్వరలోనే కోలుకొని, మళ్లీ ప్రాక్టీస్ చేస్తానని, కెరీర్‌ను కొనసాగిస్తానని క్విటోవా ధీమా వ్యక్తం చేసినప్పటికీ, అది అనుకున్నంత సులభం కాదన్నది నిజం. కాగా, క్విటోవాపై దాడి చేసిన వ్యక్తిని ఆమె ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
23 ఏళ్ల క్రితం..
సుమారు 23 సంవత్సరాల క్రితం మోనికా సెలెస్‌పైన కూడా ఒక వ్యక్తి కత్తితో దాడు చేశాడు. అప్పటికే వరుసగా మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసుం చేసుకొని, మరోసారి పోటీకి దిగేందుకు సన్నద్ధమవుతున్న సెలెస్ 1983 ఏప్రిల్‌లో హాంబర్గ్ ఓపెన్‌లో పోటీపడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మగ్దలీన మలీవాను ఢీకొని, ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. విరామ సమయంలో కుర్చీలో కూర్చున్న సెలెస్‌పై అప్పట్లో ఆమె చిరకాల ప్రత్యర్థి స్ట్ఫె గ్రాఫ్‌ను అమితంగా అభిమానించే గాంటర్ పెర్చె అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెలెస్ భుజానికి బలమైన గాయమైంది. ఈ సంఘటన తర్వాత సుమారు రెండు సంవత్సరాల ఆమె అంతర్జాతీయ టెన్నిస్‌కు దూరమైంది. తిరిగి కెరీర్‌ను కొనసాగించినా, గొప్ప ఫలితాలను సాధించలేకపోయింది.

నమ్మకాన్ని నిలబెట్టాడు
నాయర్ ఎంపిక సరైనదేనని రుజువైందన్న ఎమ్మెస్కే
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: జాతీయ జట్టుకు ఎంపిక చేసినప్పుడు కరుణ్ నాయర్‌పై తాము ఉంచిన నమ్మకాన్ని అతను నిలబెట్టాడని చీఫ్ సెలక్టర్ ఎంఎస్ ప్రసాద్ అన్నాడు. బుధవారం అతను పిటిఐతో మాట్లాడుతూ నాయర్ సామర్థ్యంపై తమకు నమ్మకం ఉంది కాబట్టే అతనిని ఎంపిక చేశామని, తమ నిర్ణయం సరైనదేనని ఇప్పుడు రుజువైందని చెన్నై టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీతో రాణించిన నాయర్‌పై ఎమ్మెస్కే ప్రశంసలు కురిపించాడు. సమర్థులను గుర్తించి, వారికి సరైన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. జయంత్ యాదవ్ కూడా ప్రతిభావండిగా పేరుతెచ్చుకున్నాడని, వీరిద్దరూ ఈ సిరీస్‌తోనే టెస్టు కెరీర్‌ను మొదలుపెట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడారని, తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారని అన్నాడు. ఆస్ట్రేలియా తో జరిగే సిరీస్‌లోనూ భారత్ ఇదే స్థాయలో ఆడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు.