క్రీడాభూమి

ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, జనవరి 26: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ మరో మూడూ బంతులు మిగిలి ఉండగా, 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ముందు 188 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా ఆతర్వాత ప్రత్యర్థిని 19.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ చేసింది. సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. 20 బంతులు ఎదుర్కొన్న అతను నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు చేసి షేన్ వాట్సన్ బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నెర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి శిఖర్ ధావన్ కూడా అవుటయ్యాడు. వనే్డ సిరీస్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన ధావన్ టి-20 సిరీస్‌లోనూ అదే బాటలో నడిచాడు. 8 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసిన అతను వాట్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడుతూ స్కోను ముందుకు దూకించారు. కెరీర్‌లో పదో టి-20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని సాధించిన అతను రైనాతో కలిసి మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 34 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేసిన రైనాను ఫాల్క్‌నెర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇన్నింగ్స్ ముగిసేందుకు మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, మరో సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 55 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో అజేయంగా 90 పరుగులు సాధించాడు. టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లకు 188 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో వాట్సన్‌కు రెండు వికెట్లు లభించగా, ఫాల్క్‌నెర్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఆస్ట్రేలియా తడబాటు
వనే్డ సిరీస్‌లో బోణీ చేసేందుకు 189 పరుగులు సాధించాల్సిన ఆస్ట్రేలియా లక్ష్యసాధనలో తడబడింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. 9 బంతుల్లో 17 పరుగులు చేసిన వార్నర్‌ను కోహ్లీ క్యాచ్ పట్టగా జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ను కోల్పోయింది. స్టీవెన్ స్మిత్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ పట్టగా పెవిలియన్ దారి పట్టడంతో ఆస్ట్రేలియా కష్టాలు మొదలయ్యాయి. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన ఫించ్ 33 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బంతిన అర్థం చేసుకోలేక, వికెట్లకు అడ్డంగా నిలబడి, ఎల్‌బి అయ్యాడు. ట్రావిస్ హెడ్ కేవలం రెండు పరుగుకే అవుటయ్యాడు. 93 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశాన్ని భారత బౌలర్లు ఇవ్వలేదు. క్రిస్ లిన్ 17, షేన్ వాట్సన్ 12, మాథ్యూ వేడ్ 5 తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. టెయిలెండర్లు జేమ్స్ ఫాల్క్‌నెర్ (10), కేన్ రిచర్డ్‌సన్ (9) కొంత సేపు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. క్రిస్ బాయిస్ మూడు పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా అవుట్‌కాగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్లలో 151 పరుగుల వద్ద ముగిసింది.
ఆకట్టుకున్న బుమ్రా
ఆస్ట్రేలియాపై మంగళవారం కెరీర్‌లో తొలి టి-20 మ్యాచ్ ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా చక్కటి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతనితోపాటు హార్దిక్ పాండ్యకు కూడా కెరీర్‌లో ఇదే మొదటి టి-20 మ్యాచ్. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. కాగా, విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన అతను తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ క్యాచ్ పట్టడంతో అతనికి వార్నర్ వికెట్ లభించింది. అనంతరం జేమ్స్ ఫాల్క్‌నెర్, క్రిస్ బాయిస్ వికెట్లను కూడా బుమ్రా సాధించాడు. మొత్తం 3.3 ఓవర్లు వేసిన అతను 23 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్య సైతం తన ఉనికి చాటుకున్నాడు. అతను రెండు వరుస ఓవర్లలో క్రిస్ లిన్, వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ వికెట్లు పడగొట్టాడు. అతను మొత్తం 3 ఓవర్లు బౌల్ చేసి, 37 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు తొలి మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. అతను ఒకే ఒక ఓవర్ బౌల్ చేసి తొమ్మిది పరుగుల సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతనికి దక్కలేదు. అనంతరం బ్యాటింగ్‌లోనూ అతను విఫలమయ్యాడు. సెకండ్ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన అతను ఐదు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి ఫాల్క్‌నెర్ బి వాట్సన్ 31, శిఖర్ ధావన్ సి వేడ్ బి వాట్సన్ 5, విరాట్ కోహ్లీ 90 నాటౌట్, సురేష్ రైనా బి ఫాల్క్‌నెర్ 41, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 11, ఎక్‌స్ట్రాలు 10,
మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 188.
వికెట్ల పతనం: 1-40, 2-41, 3-175.
బౌలింగ్: షాన్ టైట్ 4-0-45-0, కేన్ రిచర్డ్‌సన్ 4-0-41-0, జేమ్స్ ఫాల్క్‌నెర్ 4-0-43-1, షేన్ వాట్సన్ 4-0-24-2, క్రిస్ బాయిస్ 3-0-23-0, ట్రావిస్ హెడ్ 1-0-9-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ ఎల్‌బి అశ్విన్ 44, డేవిడ్ వార్నర్ సి కోహ్లీ బి బుమ్రా 17, స్టీవెన్ స్మిత్ సి కోహ్లీ బి జడేజా 21, ట్రావిస్ హెడ్ ఎల్‌బి జడేజా 2, క్రిస్ లిన్ సి యువరాజ్ బి పాండ్య 17, షేన్ వాట్సన్ సి నెహ్రా బి అశ్విన్ 12, మాథ్యూ వేడ్ సి జడేజా బి పాండ్య 5, జేమ్స్ ఫాల్క్‌నెర్ బి బుమ్రా 10, కేన్ రిచర్డ్‌సన్ బి నెహ్రా 9, క్రిస్ బాయిస్ సి పాండ్య బి బుమ్రా 3, షాన్ టైట్ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 10,
మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 151.
వికెట్ల పతనం: 1-47, 2-89, 3-89, 4-93, 5-110, 6-124, 7-129, 8-143, 9-149, 10-151.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-30-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-28-2, జస్‌ప్రీత్ బుమ్రా 3.3-0-23-3, రవీంద్ర జడేజా 4-0-21-2, హార్దిక్ పాండ్య 3-0-37-2, యువరాజ్ సింగ్ 1-0-10-0.

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మొదటి టి-20లో అర్ధ శతకంతో భారత్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన విరాట్ కోహ్లీ.

ఈ సిరీస్‌లో రెండో టి-20
ఈనెల 29న మెల్బోర్న్‌లో
జరుగుతుంది.