క్రీడాభూమి

బాత్రా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఒఎ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ పదవికి నరీందర్ బాత్రా రాజీనామా చేశాడు. కల్మాడీ, చౌతాలాలకు జీవితకాల ఉపాధ్యక్ష పదవులను కట్టబెట్టడంపై బాత్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. చెడు సంప్రదాయాలకు తెరతీసే ఇలాంటి చర్యలను తాను ఏమాత్రం సమర్ధించబోనని ఇటీవలే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన బాత్రా స్పష్టం చేశారు. కాగా, కల్మాడీ తనకు పదవి వద్దని ప్రకటించగా, చౌతాలా మాత్రం అందుకు భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. తనకు లభించిన ఐఒఎ జీవితకాల అధ్యక్ష పదవిని ఐఒసి వద్దంటే, వెంటనే దానిని వదులుకుంటానని అతను మెలికపెట్టాడు. ఒకవేళ అతను కూడా లైఫ్‌టైమ్ వైస్‌ప్రెసిడెంట్ పదవి వద్దని ప్రకటించి ఉంటే, సమస్యకు తేలిగ్గా తెరపడేది. కానీ, హఠాత్తుగా ఐఒసిని మధ్యలోకి తెచ్చిన చౌతాలా మొండిపట్టు కూర్చోగా, పెల్లుబుకుతున్న విమర్శలపై ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్ స్పందించలేదు. తమ నిర్ణయం అమలు జరిగి తీరుతుందని మొండిపట్టు పట్టి, చివరికి ఐఒఎపై వేటు పడే వరకూ సమస్యను లాగాడు. చౌతాలా, రామచంద్రన్ మొండివైఖరిని మార్చుకుంటేగానీ, నిషేధం వేటు నుంచి ఐఒఎ బయటపడే అవకాశం ఉండదు.

చిత్రం..నరీందర్ బాత్రా