క్రీడాభూమి

ఫామ్‌లోకి వస్తా : సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: మోకాలి గాయంనుంచి కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలోకి దిగిన ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ ఏడాది మార్చిలో జరిగే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో పూర్తి ప్రతిభతో రాణించడానికి మంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావాలని అంటోంది. ‘నా మెరుగుదలపై నేను సంతోషంగా ఉన్నా. నా కదలికలు ఇప్పటికీ కాస్త తడబడుతున్నాయి. అందువల్ల మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అని సోమవారం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో టాప్‌ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా మార్టిన్ చేతిలో పోరాడి ఓడిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ సైనా చెప్పింది. కుడి మోకాలి జాయింట్ లోపల గాయం కారణంగా సైనా రియో ఒలింపిక్స్‌లో గ్రూపు దశలోనే ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీర్ఘకాలం విశ్రాంతి తర్వాత ఆమె చైనా ఓపెన్‌లో బరిలోకి దిగినప్పటికీ తొలి రౌండ్‌లో ఓటమి పాలయింది.