క్రీడాభూమి

డిడిసిఎ వ్యవహారాలపై సిట్‌తో దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో చోటు చేసకున్న అవకతవకలు, ఆర్థిక కుంభకోణాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)తో దర్యాప్తు చేయించాలని బిజెపి నుంచి సస్పెండైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ డిమాండ్ చేశాడు. గురువారం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిడిసిఎ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించాడు. అదే విధంగా సిట్‌తో దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నాడు. ఇదే అంశాలతో కూడిన పిటిషన్‌ను తాను ఢిల్లీ హైకోర్టులో వేస్తానని ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధికారులు, డిడిసిఎ మాజీ అధికారులకు వ్యతిరేకంగా తన పటిషన్ ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డిడిసిఎకు అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలోనే ఎక్కువ అవతకవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించాడు. భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందని అన్నాడు. తనకు ఎవరిపైనా వ్యతిరేకత లేదని, డిడిసిఎ పాలనా వ్యవహారాలు పారదర్శకంగా సాగాలన్నదే తన అభిప్రాయమని అన్నాడు.