క్రీడాభూమి

మా ముందు పెద్ద సవాలు: మోర్గాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తన ముందు చాలా పెద్ద సవాలు ఉందని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. పటిష్టమైన టీమిండియాతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదని వ్యాఖ్యానించాడు. ఆదివారం ఉదయం నెట్స్‌కు హాజరైన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత జట్టు శక్తిసామర్థ్యాలు తనకు తెలుసునని, తమ ముందు పెద్ద సవాలు ఉందని అన్నాడు. ఉప ఖండంలో సిరీస్‌లు ఎప్పుడూ ఉత్కంఠ రేపుతాయని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, టెస్టు సిరీస్ ఫలితాల గురించి ఆలోచించడంలోవ అర్థం లేదని స్పష్టం చేశాడు. టెస్టు, వనే్డ సిరీస్‌లకు ఎంతో తేడా ఉంటుందని చెప్పాడు. కొత్త సవాళ్లకు సరికొత్తగానే సిద్ధమవుతామని అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈనెల 15న మొదటి వనే్డ పుణేలో జరుగుతుంది. రెండో వనే్డ కటక్‌లో 19న, చివరిదైన మూడో వనే్డ 22న కోల్‌కతాలో ఉంటాయి. అదే విధంగా ఇంగ్లాండ్ జట్టు భారత్‌తో మరో మూడు టి-20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. మొదటి మ్యాచ్ 26న కాన్పూర్‌లో జరుగుతుంది. రెండో మ్యాచ్ 29న నాగపూర్‌లో ఉంటుంది. ఫిబ్రవరి ఒకటిన జరిగే చివరి, మూడో టి-20 మ్యాచ్‌కి బెంగళూరు వేదిక అవుతుంది.

చిత్రం..నెట్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్