క్రీడాభూమి

బ్రబౌర్న్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 8: పరమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో యుద్ధానికి భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లు సిద్ధమవుతున్నాయి. ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం ఇరు దేశాలకు చెందిన క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈనెల 10వ తేదీన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ ‘ఎ’ జట్టు మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. 12న జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’కు ఆజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలే వనే్డ, టి-20 ఫర్మాట్స్‌లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ధోనీ, వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాతోపాటు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, రిషభ్ పంత్ తదితరులు ఆదివారం మైదానంలో చెమటోడ్చారు. అదే విధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అతని సహచరులు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు ఉదయం మైదానంలోకి వెళ్లి, మధ్యాహ్నం వరకూ రొటీన్ ఎక్సర్‌సైజ్‌ను కొనసాగించారు. ఒకరిద్దరు ఆటగాళ్లు నెట్సలో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు.
కాగా, సాయంత్రం భారత్ ‘ఎ’ జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉండింది. కానీ, ధావన్, యువరాజ్ సింగ్ వంటి కొంత మంది మాత్రమే ప్రాక్టీస్‌కు వచ్చారు.
10న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి భారత్ ‘ఎ’ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర సింగ్ చాహల్, ఆశిష్ నెహ్రా, మహిత్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
12న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి భారత్ ‘ఎ’ జట్టు: ఆజింక్య రహానే (కెప్టెన్), రిషభ్ పంత్, సురేష్ రైనా, దీపక్ హూడా, ఇషాన్ కిషన్, షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, షాబాజ్ నదీం, పర్వేజ్ రసూల్, విజయ్ కుమార్, ప్రదీప్ సంగ్వాన్, అశోక్ దిండా.

చిత్రం..బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం రొటీన్ వర్కవుట్‌కు హాజరైన ఇంగ్లాండ్ క్రికెటర్లు