క్రీడాభూమి

డేంజర్ జోన్‌లో రహానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: భారత బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతున్నది. యువరాజ్ సింగ్‌కు మరో అవకాశం, వృషభ్ సింగ్ ఎంపిక వంటి అంశాలు రహానే భవిష్యత్తుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అతనికి టెస్టు క్రికెటర్‌గా ఇప్పటికే ముద్ర పడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు రహానే దూరమైన విషయం తెలిసిందే. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అతని కుడి చూపుడు వేలుకు గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా, అతని స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చాడు. బ్యాట్స్‌మన్‌గా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. కాగా, కొంతకాలంగా రహానే ఫామ్‌లో లేకపోవడం అభిమానులను వేధిస్తున్నది. ఐదు టెస్టు ఇన్నింగ్స్‌లో అతను వరుసగా 13, 1, 23, 26, 0 చొప్పున పరుగులు చేశాడు. అసలే ఫామ్‌ను కోల్పోయిన అతనికి గాయం సమస్య కూడా తోడైంది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ, అతని ఫామ్‌పై అనుమానాలకు తెరపడలేదు. కాగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో, ప్రత్యేకించి టి-20 విభాగంలో అతను సమర్థంగా ఆడలేడని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో రహానే ఇబ్బంది పడుతున్నాడన్నది నిజం. టెస్టు మ్యాచ్‌ల్లో అలాంటి బంతులు చాలా తక్కువగా ఎదురవుతాయి. కానీ, వనే్డ లేదా టి-20 మ్యాచ్‌ల్లో తమ కోటాలోపే ఓవర్లు వేయాల్సి ఉండడంతో, బౌలర్లంతా ప్రతి ఓవర్‌నూ ఎంతో కీలకంగా భావిస్తాడు. ఆడేందుకు వీలులేని రీతిలో బ్యాట్స్‌మెన్‌కు బంతులు సంధిస్తాడు. ఈ కారణంగానే రహానే టెస్టుల్లో ఆడినంత ధాటిగా వనే్డ లేదా టి-20 ఫార్మాట్స్‌లో ఆడడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌కు సెలక్టర్లు అతనిని తీసుకోలేదు. వనే్డ సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నా, ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడా అన్నది అనుమానమే. టాప్ ఆర్డర్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. లోకేష్ రాహుల్‌ను కాదని రహానేను బ్యాటింగ్‌కు పంపే అవకాశమే లేదు. విరాట్ కోహ్లీ స్వయంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడు. ఈ పరిస్థితుల్లో రహానేకు స్థానం లభించడం సులభం కాదు. ఒకవేళ తుది జట్టులో అవకాశం దక్కితే మాత్రం, అతను సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించాలి. తనను తాను నిరూపించుకోకపోతే, పూర్తిగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

చిత్రం..ఆజింక్య రహానే