క్రీడాభూమి

కోహ్లీకి సచిన్‌ను అధిగమించే సత్తా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 9: అంతర్జాతీయ టెస్టులు, వనే్డ క్రికెట్ మ్యాచ్‌లలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ సృష్టించిన రికార్డులను అధిగమించే సామర్ధ్యం యువ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలా మంది వాదన ప్రకారం, ఇటీవలి కాలంలో కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదగడమేగాక, చాలా సందర్భాల్లో స్థిరమైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఈ తీరు చూస్తుంటే అతను సచిన్‌ను సైతం అధిగమించడం ఖాయం. భారత జట్టులోని ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు చక్కటి స్కోర్లు సాధించడంలో ఘోరంగా విఫలం కావడం ఆనవాయతీగా మారడంతో కోహ్లీపై బాధ్యత మరింత పెరిగింది. ఇలావుంటే, మూడు ఫార్మాట్స్‌లోనూ భారత జట్టుకు నాయకత్వం వహించడం కూడా కోహ్లీపై ఒత్తిడిని పెంచుతున్నది. అయతే, ధోనీ లాగా అతను తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని అనడు. సమయానుకూలంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు. రహానే టెస్టులకు బాగా పనికొస్తాడని, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో అతను రాణించలేడని ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు. పరోక్షంగా రహానే కెరీర్‌కు బ్రేక్ వేసే ప్రయత్నంలో పడ్డాడు. అలాంటి అభిప్రాయాలేవీ కోహ్లీకి లేవు కాబట్టి, అతని మార్గదర్శకంలో రహానే వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆశిద్దాం.

చిత్రం..విరాట్ కోహ్లీ