క్రీడాభూమి

‘టాప్-10’లో స్థానమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 9: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని ఇక్కడ జరిగిన చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించిన స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు రాబర్టో బటిస్టా అగుట్ స్పష్టం చేశాడు. అయితే, అది అనుకున్నంత సులభం కాదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. చెన్నై ఓపెన్‌ను గెల్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. ఈ టోర్నీలో తాను సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించానని కెరీర్‌లో ఐదో ఎటిపి టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్న బటిస్టా అగుట్ అన్నాడు. ఫైనల్‌లో 20 ఏళ్ల డానియల్ మెద్వెదేవ్ నుంచి గట్టిపోటీ ఎదురైందని, ఎంతో శ్రమించిన తర్వాతగానీ తనకు 6-3, 6-4 తేడాతో విజయం సాధ్యం కాలేదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కండరాల నొప్పి బాధించిందని, కానీ, ఆ సమస్యను సమర్థంగా అధిగమించగలిగానని తెలిపాడు.