క్రీడాభూమి

మళ్లీ ఫ్రెంచ్ ఫార్ములా వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 9: ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ సుమారు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఫార్ములా వన్ రేస్ క్యాలండర్‌లో చోటు దక్కించుకోనుంది. 2018లో ఈ రేసును నిర్వహించడానికి అనుమతి లభించిందని, ఇకపై నిరంతరాయంగా ఈ రేస్ ఉంటుందని ఫ్రాన్స్ ఫార్ములా వన్ సంఘం (ఎసిఎఫ్) ప్రకటించింది. 2008లో చివరిసారి ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీని మాగ్నీ ఫార్ములా వన్ సర్క్యూట్‌పై నిర్వహించారు. ఆతర్వాత ఈ సర్క్యూట్‌ను ఫార్ములా వన్ అధినేత బెర్నీ ఎకెల్‌స్టోన్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ జరగలేదు. కాగా, 2018లో దీనిని నిర్వహించేందుకు అనుమతి లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.