క్రీడాభూమి

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఒకీఫ్‌కు బిగ్ బాష్ నుంచి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 9: ప్రతిష్ఠాత్మకమైన బిగ్ బాష్ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాల్సిన ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీఫెన్ ఒకీఫ్ హఠాత్తుగా వైదొలిగాడు. అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. కాగా, భారత్‌తో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని, సిఎ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరో స్పిన్నర్ నాథన్ లియాన్‌తో కలిసి అతనిని భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు సిద్ధం కావాలని అతనికి సిఎ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

చిత్రం..స్టీఫెన్ ఒకీఫ్