క్రీడాభూమి

ట్రోఫీపై గుజరాత్ ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 9: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, ఆరున్నద దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించాలని గుజరాత్ భావిస్తున్నది. అయితే, ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 41 పర్యాయాలు టైటిల్ సాధించిన ముంబయికి ఆ జట్టు ఏ స్థాయిలో పోటీనిస్తుందో చూడాలి. తమిళనాడును ముంబయి, జార్ఖండ్‌ను గుజరాత్ సెమీ ఫైనల్‌లో ఓడించి ఫైనల్ చేరిన ఈ రెండు జట్లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న తుది పోరులో తలపడనున్నాయి. 2012-13 సీజన్‌లో విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను సాధించిన గుజరాత్ ఇటీవల కాలంలో పటిష్టమైన జట్టుగా ఎదిగింది. ముంబయిలో చాలా మంది స్టార్లు ఉంటే, పార్థీవ్ పటేల్ నాయకత్వం వహిస్తున్న గుజరాత్‌లో కడవరకూ పోరాడే తత్వంగల ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. జార్ఖండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించడంలో జస్‌ప్రీత్ బుమ్రా, ఆర్పీ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో ముంబయిపై మరోసారి వీరు సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తున్నది. బుమ్రా అందుబాటులో లేనప్పుడు తుది జట్టులో స్థానం సంపాదిస్తున్న మెహుల్ పటేల్ కూడా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈసారి రంజీ గ్రూప్ దశలో ముంబయిని ఓడించిన రికార్డు కూడా గుజరాత్‌కు ఉంది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 437 పరుగుల భారీ స్కోరు సాధించిన గుజరాత్ ఆతర్వాత ముంబయి దూకుడుకు కళ్లెం వేసింది. చివరికి ఆ జట్టును 422 పరుగులకు కట్టడి చేసింది. మ్యాచ్ డ్రాగా ముగియగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గుజరాత్‌కు మూడు పాయింట్లు లభించాయి. ఇలావుంటే, మరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ముంబయి జట్టు ఫైనల్‌కు సిద్ధమైంది. సెమీ ఫైనల్స్‌లో సెంచరీ సాధించిన 17 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా తుది పోరులోనూ అదే స్థాయిలో ఆడే అవకాశం ఉంది. మొత్తం మీద రంజీ ఫైనల్‌లో ముంబయి ఫేవరిట్‌గా ముద్ర వేయించకున్నప్పటికీ, గుజరాత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు.