క్రీడాభూమి

అండర్-19 ట్రై సిరీస్ సర్ఫ్‌రాజ్ మెరుపు బ్యాటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 29: ముంబయికి చెందిన సర్ఫ్‌రాజ్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్‌కు ఏడు వికెట్ల భారీ తేడాతో విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 36.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. నజ్ముల్ హొస్సేన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో మాయాంగ్ దాగర్ 32 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టారు. మహిపాల్ లొమ్‌రోర్ 11 పరుగులకు రెండు, శుభం మవీ 21 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. అనంతరం 117 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 13.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. రిషబ్ పంత్ 26 పరుగులు చేసి అవుట్‌కాగా, సర్ఫ్‌రాజ్ 59, కెప్టెన్ రికీ భుయ్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు టైటిల్‌ను అందించారు. లీగ్ దశలో రెండుసార్లు బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత జట్టు మరోసారి అదే ఆధిపత్యాన్ని కనబరచింది. కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసి, భారత్‌కు అండగా నిలిచిన సర్ఫ్‌రాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రిషబ్ పంత్ స్వీకరించాడు. అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ త్వరలోనే జరగనున్న తరుణంలో భారత్ మంచి ఫామ్‌ను కొనసాగించడం విశేషం.