క్రీడాభూమి

ఆనంద్ కెప్టెన్సీ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: భారత డేవిస్ కప్ జట్టుకు తన సోదరుడు ఆనంద్ అమృత్‌రాజ్‌ను నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై భారత మాజీ టెన్నిస్ స్టార్ విజయ్ ఆమృత్‌రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి భారత టెన్నిస్ చరిత్రలో ఆనంద్ కెప్టెన్సీని అత్యుత్తమ భాగంగా పేర్కోవచ్చని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. తనకు తెలిసినంత వరకూ, 1986 తర్వాత ఆనంద్ మాదిరి జట్టును ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్లిన కెప్టెన్ లేడని వ్యాఖ్యానించాడు. ఆనంద్ కాంట్రాక్టును కనీసం ఒక సీజన్‌కు పొడిగించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మహేష్ భూపతి నియామకాన్ని అతను సమర్థించాడు. భూపతి అన్ని విధాలా అర్హుడని కితాబునిచ్చాడు.

చిత్రం..విజయ్ ఆమృత్‌రాజ్