క్రీడాభూమి

గుజరాత్‌కు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 12: సుమారు ఆరున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించి, రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న గుజరాత్ తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఒక అడుగు ముందుకేసింది. ముంబయితో జరుగుతున్న ఫైనల్‌లో కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా, రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబయి మూడో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో రాణించడం మూడో రోజు ఆట విశేషం. ముంబయి మొదటి ఇన్నింగ్స్‌లో 228 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన గుజరాత్ రెండో రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి ఆనర లికీట్మకర 291 పరుగలు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, 104.3 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై, సరిగ్గా 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ పార్థీవ్ పటేల్ (90), మన్‌ప్రీత్ జునేజా (77) అర్ధ శతకాలు సాధించి, తమ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించడంలో ప్రధాన భూమిక పోషించాడు. ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 84 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. బల్వీందర్ సంధు, అభిషేక్ నాయర్ చెరి మూడు వికెట్లు సాధించారు.
శ్రేయాస్ పోరాటం
మొదటి ఇన్నింగ్స్‌లో వంద పరుగులు వెనుకంజలో ఉన్న ముంబయిని ఆదుకోవడానికి శ్రేయాస్ అయ్యర్ శక్తివంచన లేకుండా పోరాడాడు. అయితే, 137 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేసిన అతను చింతన్ గజా బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. అంతకు ముందు టీనేజ్ సంచలనం పృథ్వీ షా, అఖిల్ హెర్వాద్కర్ మొదటి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. షెర్వాద్కర్ 16 పరుగులు చేసి, చింతన్ గజా బౌలింగ్‌లోనే సమిత్ గోహెల్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. పృథ్వీ షా వికెట్ కూడా చింతన్ గజాకే లభించింది. 35 బంతులు ఎదుర్కొన్న షా ఎనిమిది ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి, వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు చేజార్చుకొని 208 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 45, ఆదిత్య తారే 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ప్రస్తుతానికి ముంబయి 108 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో పోరు ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 83.5 ఓవర్లలో 228 ఆలౌట్ (పృథ్వీ షా 77, సూర్యకుమార్ యాదవ్ 57, అభిషేక్ నాయర్ 35, ఆర్పీ సింగ్ 2/48, చింతన్ గజా 2/46, రుజుల్ భట్ 2/5).
గుజరాత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 291): 104.3 ఓవర్లలో 328 ఆలౌట్ (్భర్గవ్ మెరాయ్ 45, పార్థీవ్ పటేల్ 90, మన్‌ప్రీత్ జునేజా 77, శార్దూల్ ఠాకూర్ 4/84, బల్వీందర్ సంధు 3/63, అభిషేక్ నాయర్ 3/54).
ముంబయి రెండో ఇన్నింగ్స్: 67 ఓవర్లలో 3 వికెట్లకు 208 (పృథ్వీ షా 44, శ్రేయాస్ అయ్యర్ 82, సూర్యకుమార్ యాదవ్ 45 నాటౌట్, చింతన్ గజా 3/54).

చిత్రం..శ్రేయాస్ అయ్యర్ (82)