క్రీడాభూమి

టీమిండియా లక్ష్యం ‘క్లీన్‌స్వీప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 30: ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆదివారం నాటి మ్యాచ్‌కి మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లను గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఇక చివరి మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి ఆసీస్‌కు వైట్‌వాష్ వేయడంపై కనే్నసింది. బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా ఫామ్‌లోకి రావడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. శుక్రవారం జరిగిన రెండో టి-20లో రోహిత్ శర్మ (60), శిఖర్ ధావన్ (42), విరాట్ కోహ్లీ (59 నాటౌట్) అద్భుతంగా రాణించారు. ఫలితంగా భారత్ 20 ఓవర్‌లో 3 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరకుండా నిరోధించే బాధ్యతను భారత బౌలర్లు సమర్థంగా పోషించారు. జస్‌ప్రీత్ బుమ్రా 37 పరుగులకు రెండు, రవీంద్ర జడేజా 32 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఒక్కో వికెట్ సాధించిన రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్య, యువరాజ్ సింగ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆశిష్ నెహ్రా ఒక్కడే విఫలమయ్యాడు. అతను నాలుగో ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకొని, ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మొత్తం మీద సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి మ్యాచ్‌కి సిద్ధంగా ఉంది.
ప్రయోగాలకు అవకాశం
ఈ ఏడాది మార్చి 8 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ స్వదేశంలో జరిగే టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం నాటి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వేర్వేరు కాంబినేషన్స్‌ను అతను ప్రయత్నించవచ్చు. రెండో టి-20లో నెహ్రా భారీగా పరుగులు సమర్పించుకున్న నేపథ్యంలో అతనికి విశ్రాంతినిచ్చి, ఉమేష్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారన్న వాదన ఉంది. కాగా, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో చూడాలి.