క్రీడాభూమి

సయ్యద్ మోదీ బాడ్మింటన్ ఫైనల్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 30: సయ్యద్ మోదీ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌లో అతను బూన్సాక్ పొన్సానాను 21-14, 21-7 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను సెమీస్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో హువాంగ్ యూజియాంగ్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాడు. మరో సెమీ ఫైనల్‌లో యూజియాంగ్ 17-21, 22-20, 21-12 స్కోరుతో షియూగీపై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో సయాకా సతో, సంగ్ జిహుయున్ టైటిల్ కోసం పోరాడనున్నారు. సయాకా సెమీ ఫైనల్‌లో పోర్న్‌టిప్ బురానప్రసెర్ట్‌సక్‌పై 21-15, 21-17 తేడాతో విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్‌లో సయాకా 21-16, 21-8 ఆధిక్యంతో నిచావొన్ జిందాపొల్‌పై గెలుపొందింది.
జ్వాల, అశ్వినీ జోడీ అవుట్
మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ పరాజయాన్ని చవిచూసింది. సెమీ ఫైనల్‌లో వీరిపై జంగ్ క్యుంగ్ యున్, షిన్ సియుంగ్ చాన్ జోడీ 21-14, 21-16 తేడాతో విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్‌లో ఇఫెముస్కెన్స్, సెలెనా పీట్ జోడీ 21-17, 21-8 తేడాతో చాంగ్ యెనా, లీ సొ హి జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఆకాష్ దెవాల్కర్ జోడీ 25-23, 13-21, 21-17 తేడాతో కిమ్ సారాంగ్, కిమ్ జి జంగ్ జోడీపై విజయం సాధించింది.