క్రీడాభూమి

టైటిల్ దిశగా ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 20: డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించగా, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకునే అవకాశాలను మెరుగుపరచుకున్న ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశాడు. మూడో రౌండ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ శామ్ క్వెర్రీని 6-4, 6-2, 6-4 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. నిరుడు వింబుల్డన్‌లో జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన క్వెర్రీ ఈసారి కూడా స్టార్ ఆటగాళ్లకు సవాళ్లు విసిరే అవకాశం ఉందని నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే, ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి టైటిల్‌ను కైవసుం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ముర్రే తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, రెండు గంటలలోపే మ్యాచ్‌ని ముగించాడు. క్వార్టర్స్‌లో స్థానం కోసం అతను మిచా జ్వెరెవ్‌ను ఢీ కొంటాడు. ఇలావుంటే, నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా కూడా ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను విక్టర్ ట్రొయికీని 3-6, 6-2, 6-2, 7-6 తేడాతో ఓడించాడు. 12వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సొంగా ఒక మారథాన్ మ్యాచ్‌లో 7-6, 7-5, 6-7, 6-3 ఆధిక్యంతో జాక్ సాక్‌పై విజయం సాధించాడు. జపాన్ వీరుడు కెయ్ నిషికోరి 6-4. 6-4, 6-4 తేడాతో క్వాలిఫయర్ లుకాస్ లాకోపై గెలిచాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతను కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను ఢీ కొంటాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెదరర్ 6-2, 6-4, 6-4 స్కోరుతో తొమాస్ బెర్డిచ్‌పై విజయం సాధించాడు. అన్‌సీడెడ్ ఆటగాడు. డానియల్ ఇవాన్స్ 7-5, 7-6, 7-6 తేడాతో 27వ సీడ్ బెర్నార్డ్ టోమిక్‌పై సంచలన విజయం సాధించాడు.