క్రీడాభూమి

గరిష్ఠంగా 18 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేదా దాని అనుబంధ సంఘాలకు చెందిన పాలక వర్గంలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సభ్యుడిగా ఉండవచ్చు? గరిష్ఠ పరిమితి ఎంత? అన్న ప్రశ్నలకు సుప్రీం కోర్టు శుక్రవారం వివరణ ఇచ్చింది. ఈనెల 2, 3 తేదీల్లో ఇచ్చిన తీర్పుల వల్ల తలెత్తిన గందరగోళానికి తెరదించుతూ, ఒక సభ్యుడు గరిష్టంగా 18 సంవత్సరాలు భారత క్రికెట్‌కు బిసిసిఐ లేదా అనుబంధ సంఘాల వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా సేవలు అందించే అవకాశం ఉందని తెలిపింది. బిసిసిఐలో తొమ్మిది సంవత్సరాలు, అనుబంధ సంఘాల్లో మరో తొమ్మిది సంవత్సరాలు వర్కింగ్ కమిటీలో ఉండవచ్చని, దీనితో మొత్తం మీద ఒక వ్యక్తి గరిష్ఠంగా 18 సంవత్సరాలు పాలక మండళ్లలో సభ్యుడిగా వ్యవహరించవచ్చని వివరించింది. అయితే, బిసిసిఐ పాలక మండలికి మూడేళ్ల కాలానికి ఒకసారి చొప్పున వరుసగా రెండు పర్యాయాలు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావచ్చని, మరోసారి పోటీ చేయడానికి ముందు ఖచ్చితంగా మూడేళ్ల కూలింగ్ పీరియడ్ కింద క్రికెట్ పాలనా వ్యవహారాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. గత తీర్పు, అటు బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల్లో కలిపి, మొత్తం గరిష్టంగా తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పాలక వర్గాల్లో సభ్యులుగా ఉండవచ్చనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది. బిసిసిఐ, అనుబంధ సంఘాలకు వేరువేరుగా తొమ్మిదేసి సంవత్సరాలు, అంటే మొత్తం మీద భారత క్రికెట్‌కు 18 సంవత్సరాలు గరిష్ఠంగా ఒక వ్యక్తి వివిధ హోదాల్లో సేవలు అందించే అవకాశం ఉందని స్పష్టం చేయడం ద్వారా, ఇప్పటి వరకూ వ్యక్తమవుతున్న అనుమానాలకు తెరదించింది.
ఇలావుంటే, లోధా కమిటీ సిఫార్సుల అమలు కోసం ఈనెల 24న ముగ్గురు పాలనాధికారులను నియమించనున్నట్టు ప్రకటించింది. దీని కోసం బోర్డు తరఫున లాయర్లు తొమ్మిది మంది పేర్లను సమర్పించగా, అంత మందిని పాలనాధికారులుగా నియమించడం అసాధ్యమని తేల్చిచెప్పింది. అయితే, వారు ఇచ్చిన జాబితా నుంచి ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి, లోధా సిఫార్సుల అమలు బాధ్యతను సుప్రీం కోర్టు దానికి అప్పగించే అవకాశం ఉంది. ఈ సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నందుకు బిసిసిఐ పాలక మండలిపై కోర్టు పలు సందర్భాల్లో మండిపడిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ పాలనా వ్యవహారాలను పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ చేసిన సూచనలను తు.చ తప్పకుండా అమలు చేయాలని నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పులో తేచ్చిచెప్పింది. అయితే, బిసిసిఐ పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తడంతో, లోధా కమిటీ సిఫార్సుల అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల మొదటి వారంలో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీం కోర్టు తొలగించిన విషయం తెలిసిందే. బోర్డుకు పాలనాధికారులను నియమించి, వారికే లోధా సిఫార్సుల అమలు బాధ్యతను అప్పగించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సుప్రీం కోర్టు ఈనెల 24న నియామకాలను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. అయతే, పేర్లను వెల్లడించడానికి నిరాకరించింది.