క్రీడాభూమి

న్యూజిలాండ్, బంగ్లాదేశ్ హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, జనవరి 21: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజున 289 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ను ఏడు వికెట్లకు 260 పరుగులకు కట్టడి చేసింది. బ్యాటింగ్‌లో రాణించి 59 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ 32 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. 45 పరుగుల స్కోరువద్ద జీత్ రావల్ (16) వికెట్‌ను కోల్పోయిన కివీస్‌ను టామ్ లాథమ్ (68), రాస్ టేలర్ (77), హెన్రీ నికోల్స్ (56) అర్ధ శతకాలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, భారీ స్కోరు సాధిండంలో వీరు విఫలంకాగా, మిగతా వారు ఆ మాత్రం కూడా ఆడలేకపోయారు. మొత్తం మీద బంగ్లాదేశ్ కంటే 29 పరుగులు వెనుకంజలో ఉన్న కివీస్ చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. మూడో రోజు ఆటలో ఈలోటును భర్తీ చేయడమేగాక, కొద్దిపాటి ఆధిక్యాన్ని ఆ జట్టు సంపాదించే అవకాశాలున్నాయి. అయితే, బంగ్లాదేశ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే స్థాయిలో ఆధిక్యం న్యూజిలాండ్‌కు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 84.3 ఓవర్లలో 289 ఆలౌట్ (సౌమ్య సర్కార్ 86, షకీబ్ అల్ హసన్ 59, నూరుల్ హసన్ 47, టిమ్ సౌథీ 5/94, ట్రెంట్ బౌల్ట్ 4/87).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 71 ఓవర్లలో 7 వికెట్లకు 260 (టామ్ లాథమ్ 68, రాస్ టేలర్ 77, హెన్రీ నికోల్స్ 56, షకీబ్ అల్ హసన్ 3/32, కమ్రుల్ ఇస్లామ్ 2/48).

హెచ్‌పిఒఎ అధ్యక్షుడిగా ఠాకూర్ ఎన్నిక
ధర్మశాల, జనవరి 21: సుప్రీం కోర్టు ఆ దేశించడంతో భారత క్రికెట్ ని యంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవిని కోల్పో యన అనురాగ్ ఠాకూర్ క్రీడా రంగానికి దూరం కావాలని అనుకోవడం లేదు. శని వారం ఇక్కడ జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఒ లింపిక్ సంఘం (హెచ్‌పిఒఎ) అధ్యక్షుడిగా అతను బరిలోకి దిగడంతో, ఇతరులు ఎవ రూ పోటీకి సాహసించలేదు. దీనితో అత ను సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్ని కయ్యాడు. లోధా కమిటీ సిఫార్సులను అ మలు చేయడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రద ర్శించిన ఠాకూర్ విమర్శలకు గురైన విష యం తెలిసిందే. బోర్డు పాలక మండలికి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికైన వా రు ఒక టెర్మ్ దూరంగా ఉండాలన్న లోధా సూచనలను అనుసరించి ఠాకూర్‌తోపాటు బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేను కూడా పదవి నుంచి సుప్రీం కోర్టు తప్పించిన వి షయం తెలిసిందే.

లంకపై దక్షిణాఫ్రికా గెలుపు
సెంచూరియన్, జనవరి 21: దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైన శ్రీలంక టి-20 సిరీస్‌లో ఎదురుదాడికి దిగుతుందని అంతా ఆశించారు. కానీ, మ్యాచ్ అందుకు భిన్నంగా కొనసాగింది. వాతావరణం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో ఐదు వికెట్లకు 126 పరుగులు సాధించింది. డేవిడ్ మిల్లర్ కేవలం 18 బంతుల్లోనే 40 పరుగుల చేయడం విశేషం. అతని స్కోరులో మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఫర్హాన్ బెహార్దియన్ 31 పరుగులు సాధించాడు. లంక బౌలర్లలో నువాన్ కులశేఖర 27 పరుగులిచ్చి 2 వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చసింది. ఓపెనర్లు నిరోషన్ డిక్‌వెల్లా (43), ధనంజయ డి సిల్వ (27) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో లంకకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 10 ఓవర్లలో 5 వికెట్లకు 126 (డేవిడ్ మిల్లర్ 40, ఫర్హాన్ బెహార్డియన్ 31, తీనిస్ డి బ్రూన్ 19, నువాన్ కులశేఖర 2/27, సికూగే ప్రసన్న 1/14).
శ్రీలంక ఇన్నింగ్స్: 10 ఓవర్లలో 6 వికెట్లకు 107 (నిరోషన్ డిక్‌వెల్లా 43, ధనంజయ డి సిల్వ 27, లూంగీ జిడీ 2/12, ఇమ్రాన్ తాహిర్ 2/23).