క్రీడాభూమి

రెస్ట్ఫా ఇండియాకు గజా, హార్దిక్ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 102.5 ఓవర్లలో 358 ఆలౌట్ (ప్రియాంక్ పాంచాల్ 30, ధ్రువ్ రావల్ 39, మన్‌ప్రీత్ జునేజా 47, చిరాగ్ గాంధీ 169, సిద్ధార్థ్ కౌల్ 5/86, పంకజ్ సింగ్ 4/104).
రెస్ట్ఫా ఇండియా తొలి ఇన్నింగ్స్: 72 ఓవర్లలో 9 వికెట్లకు 206 (అఖిల్ హెర్వాద్కర్ 48, చటేశ్వర్ పుజారా 86, కరుణ్ నాయర్ 28, చింతన్ గజా 4/46, హార్దిక్ పటేల్ 3/73, మోహిత్ థడానీ 2/48).

ముంబయి, జనవరి 21: ఇరానీ ట్రోఫీలో రెస్ట్ఫా ఇండియాను ఢీ కొంటున్న రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆ జట్టు పేసర్ చింతన్ గజా, స్పిన్నర్ హార్దిక్ పటేల్ చెరి మూడు వికెట్లు కూల్చి రెస్ట్ఫా ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 206 పరుగులకు కట్టడి చేశారు. అంతకు ముందు, ఎనిమిది వికెట్లకు 300 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, శనివారం ఉదయం ఆటను కొనసాగించిన గుజరాత్ మరో 58 పరుగులు జోడించి, మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. సెంచరీ వీరుడు చిరాగ్ గాంధీ 202 బంతుల్లో, 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 169 పరుగులు సాధించి, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈశ్వర్ చౌదరీ 15 పరుగులు సాధించి, పంకజ్ సింగ్ బౌలింగ్‌లో మనోజ్ తివారీకి చిక్కాడు. గుజరాత్ 102.5 ఓవర్లలో ఆలౌటయ్యే సమయానికి హార్దిక్ పటేల్ 18 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెస్ట్ఫా ఇండియా బౌలర్ సిద్ధార్థ్ కౌల్ 26 ఓవర్లు బౌల్ చేసి, 86 పరుగులకే ఐదు వికెట్లు కూల్చడం విశేషం. మరో పేసర్ పంకజ్ సింగ్ 104 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు.
గుజరాత్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించగా, బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న రెస్ట్ఫా ఇండియా తన స్థాయికి భిన్నంగా ఆడింది. 21 పరుగుల స్కోరు వద్ద అభినవ్ ముకుంద్ (8) అవుట్ కావడంతో మొదలైన వికెట్ల పతనాన్ని ఓపెనర్ అఖిల్ హెర్వాద్కర్, ఫస్డ్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ చటేశ్వర్ పుజారా కొద్దిసేపు అడ్డుకున్నారు. అయితే, 89 పరుగుల స్కోరువద్ద హెర్వాద్కర్ వికెట్ కూలడంతో రెస్ట్ఫా ఇండియా సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. అతను 82 బంతుల్లో 48 పరుగుల ఉచేసి, హార్దిక్ పటేల్ బౌలింగ్‌లో ధ్రువ్ రావల్‌కు దొరికిపోయాడు. కరుణ్ నాయర్ (28), మనోజ్ తివారీ (12), వృద్ధిమాన్ సాహా (0), కుల్దీప్ యాదవ్ (5) పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టును ఆదుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిన పుజారా 156 బంతుల్లో, 11 ఫోర్లతో 86 పరుగులు చేసి ఈశ్వర్ చౌదరీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్‌కావడంతో రెస్ట్ఫా ఇండియా ఆశలు అడుగంటిపోయాయి. షాబాజ్ నదీం, సిద్ధార్థ్ కౌల్ పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ చేరారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్లకు 206 పరుగులు చేయగా, పంకజ్ సింగ్ 7, మహమ్మద్ సిరాజ్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చింతన్ గజా, హార్దిక్ పటేల్ చెరి మూడు వికెట్లు పడగొట్టడంతో కష్టాల్లో పడిన రెస్ట్ఫా ఇండియా ఇంకా 152 పరుగులు వెనుకంజలో ఉంది. కేవలం ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఖాయంగా కనిపిస్తున్నది.