క్రీడాభూమి

కెప్టెన్ ధోనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 21: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి వైదొలగిన మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్ అవతారం ఎత్తాడు. ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ బిజీబిజీగా గడిపాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం నాటి చివరి వనే్డకు సిద్ధమవుతున్న టీమిండియా శనివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఇది ఐచ్ఛికం కావడంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. అతను అందుబాటులో లేకపోవడంతో, ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను పర్యవేక్షించే బాధ్యతను ధోనీ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ తదితరులకు అతను బ్యాటింగ్‌లో సూచనలు ఇచ్చాడు. కొంత సేపు సరదాగా నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. ప్రతి మ్యాచ్‌కి ముందురోజే ఇరు జట్ల కెప్టెన్లు ప్రాక్టీస్ సెషన్ సమయంలోనే పిచ్‌ని నిశితంగా పరిశీలిస్తారు. వికెట్‌పై పచ్చిక ఎంత మేరకు ఉంది? పగుళ్లు ఏవైనా కనిపిస్తున్నాయా? అన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తారు. జట్టు అనుసరించాల్సిన వ్యూహాలను అప్పుడే ఖాయం చేసుకుంటారు. కాగా, శనివారం కోహ్లీ మైదానంలోకే రాకపోవడంతో, అతని బాధ్యతను ధోనీనే భుజానికెత్తుకున్నాడు. పిచ్‌పై గడ్డి ఎక్కువగా లేకపోవడంతో, మోకాళ్లపై కూర్చొని మరీ స్ట్రిప్‌ను పరిశీలించాడు. రెండు చేతులతో నొక్కుతూ, పిచ్‌పై తేమ ఎంత ఉందో పరీక్షించాడు. కోచ్ అనిల్ కుంబ్లే కూడా అక్కడ లేకపోవడంతో, ధోనీ ఒక్కడే పిచ్ తీరుతెన్నులను బేరీజు వేసే పనిలో పడ్డాడు. అంతకు ముందు సుమారు రెండు గంటలు సాగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ ధోనీ ఉత్సాహంగా కనిపించాడు. ప్రస్తుతం జాతీయ సెలక్టర్‌గా ఉన్న బెంగాల్ మాజీ కెప్టెన్ దేవాంగ్ గాంధీతో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. మొత్తానికి అతను రెగ్యులర్ కెప్టెన్ మాదిరిగానే శనివారం నాటి నెట్స్‌లో కనిపించాడు. మొదటి వనే్డలో కెప్టెన్ కోహ్లీకి సమాచారం ఇవ్వకుండా, అతని అనుమతి తీసుకోకుండానే అంపైర్ నిర్ణయంపై రివ్యూ (డిఆర్‌ఎస్)ను ధోనీ కోరడం చర్చనీయాశంమైంది. అయితే, అతను ఎంతో అనుభవజ్ఞుడని, కాబట్టి, ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని ఆ సంఘటనకు కోహ్లీ ప్రాధాన్యం ఇవ్వలేదు. కటక్‌లో జరిగిన రెండో వనే్డలో భువనేశ్వర్ చివరి ఓవర్ వేస్తున్నప్పుడు కోహ్లీకి బదులు ధోనీనే ఫీల్డింగ్‌లో మార్పులుచేర్పులు చేశాడు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ మాదిరే అన్ని బాధ్యతలను నిర్వర్తించాడు.

హాలెస్ స్థానంలో వికెట్‌కీపర్ బెయిర్‌స్టో
కోల్‌కతా, జనవరి 21: చేతి వేలికి గాయం కావడంతో స్వదేశానికి తిరిగి వెళ్లిన ఓపెనర్ అలెక్స్ హాలెస్ స్థానంలో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోను ఎంపిక చేసినట్టు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ప్రకటించింది. భారత్‌తో కటక్‌లో రెండో వనే్డ ఆడుతున్నప్పుడు హాలెస్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఎముక చిట్లినట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో, జట్టు మేనేజ్‌మెంట్ అతనిని స్వదేశానికి పంపింది. కాగా, వనే్డలకు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కీపర్‌గా ఇంగ్లాండ్‌కు బెయిర్‌స్టో సేవలు అందించాడు. అతనికి వనే్డ జట్టులో స్థానం లభించలేదు.
ఇలావుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు శనివారం నెట్స్‌లో శ్రమించారు. ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌పైన కూడా దృష్టి కేంద్రీకరించారు.