క్రీడాభూమి

మకరోవా మ్యాజిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 21: ఎంతో మంది సీడెడ్ క్రీడాకారిణులు పలు టోర్నీల్లో ఓడించిన ‘సీడ్ కిల్లర్’ ఎకతరీన మకరోవా మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఆమె ఆరోసీడ్ డొమినికా సిబుల్కోవాను 6-2, 6-7, 6-3 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే అప్పటి 19వ సీడ్ అనా ఇవానోవిచ్, 12వ సీడ్ సెరెనా విలియమ్స్, 5వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్, 3వ సీడ్ సిమోనా హాలెప్ తదితరులను ఓడించిన ఆమె ధాటికి ఈసారి సిబుల్కోవా ఇంటిదారి పట్టింది.
ప్రీ క్వార్టర్స్‌లో సెరెనా
నిరుడు రన్నరప్‌గా నిలిచిన రెండో సీడ్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌లో నికోల్ గిబ్స్‌ను 6-1, 6-3 తేడాతో చిత్తుచేసింది. ఈసారి టైటిల్ వేటలో ముందు వరుసలో ఉన్న ఆమె వరుసగా మూడో మ్యాచ్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఖాతాలో వేసుకొని ప్రీ క్వార్టర్స్ చేరింది. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జాతో కలిసి ఆడుతున్న బార్బరా స్ట్రయికోవా సింగిల్స్ విభాగం మూడో రౌండ్‌లో కరోలిన్ గార్సియాను 6-2, 7-5 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని జొహన్నా కొన్టా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచిన కొన్టా 6-3, 6-1 తేడాతో నెగ్గింది. 15వ సీడ్ డరియా గవ్రిలోవా 6-3, 5-7, 6-4 ఆధిక్యంతో 12వ సీడ్ తిమియా బసిన్‌స్కీపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐదో సీడ్ కరోలినా ప్లిస్కోవా 4-6 తేడాతో మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత ఎదురుదాడికి దిగి జెజెనా అస్టాపెన్కోను చివరి రెండు సెట్లలో 6-0, 10-8 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరింది.

మారథాన్ మ్యాచ్‌లో నాదల్ విజయం
మెల్బోర్న్, జనవరి 21: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ రాఫెల్ నాదల్, 24వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య పోరు ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపింది. 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన నాదల్ ఆతర్వాత మెల్బోర్న్‌లో విజేతగా నిలవలేకపోయాడు. గత రెండేళ్లుగా ఫిట్నెస్ సమస్య అతనిని తీవ్రంగా వేధిస్తున్నది. ఫలితంగా చాలా టోర్నీలకు దూరమయ్యాడు. ఆడిన టోర్నీల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గాయాల సమస్యతో కెరీర్ ప్రమాదంలో పడిన తరుణంలో నాదల్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు. మూడో రౌండ్‌లో జ్వెరెవ్‌పై 4-6, 6-3, 6-7, 6-3, 6-2 తేడాతో తీరు అతని పట్టుదలకు అద్దం పడుతుంది.
కాగా, ఎనిమిదో సీడ్ డొమినిక్ థియెమ్ 6-1, 4-6, 6-4, 6-4 ఆధిక్యంతో బెనోట్ పైర్‌ని ఓడించాడు. ఆరో సీడ్ గేల్ మోన్ఫిల్ 6-3, 7-6, 6-4 తేడాతో ఫిలిప్ కొల్చెబెర్‌పై నెగ్గి, ప్రీ క్వార్టర్స్ చేరాడు.