క్రీడాభూమి

క్వీన్‌స్వీపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 21: ఇంగ్లాండ్‌పై వనే్డ సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించడమే భారత్ లక్ష్యంగా ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 0-2 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే చివరి, మూడో మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకొని, ప్రత్యర్థికి వైట్‌వాష్ వేయడమే లక్ష్యంగా ఎంచుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ రెగ్యులర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి వనే్డ సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ సంపూర్ణ విజయం కోసం తహతహలాడుతున్నాడు. మొదటి వనే్డలో కోహ్లీ, కేదార్ జాదవ్ శతకాలతో కదం తొక్కితే, రెండో మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే, రెండో వనే్డలో ఇంగ్లాండ్ తీవ్రంగా పోరాడింది. భారత్ తన ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని చూసి భయపడకుండా, చివరి క్షణం వరకూ విజయం కోసం శ్రమించింది. కేవలం 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కోహ్లీ సేనకు ఏమాత్రం తగ్గకుండా, నువ్వానేనా అన్న చందంగా యుద్ధాన్ని కొనసాగించిన ఇయాన్ మోర్గాన్ బృందం చివరి మ్యాచ్‌ని గెల్చుకొని, పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది.
కాగితంపై చూస్తే ఇంగ్లాండ్ కంటే టీమిండియా పటిష్టంగా కనిపిస్తున్నది. కానీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ప్రతికూల ఫలితం ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. జయాపజయాలు ఎలావున్నా, ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లు భారీ స్కోర్లు చేయడంతో, అభిమానులకు మరో ఉత్కంఠ భరితమైన పోరు చూసే అవకాశం లభించడం ఖాయం.
భువనేశ్వర్ కుమార్‌కు ధోనీ బ్యాటింగ్ టిప్స్

‘మలేసియా’ టైటిల్‌కు చేరువలో సైనా
సరవాక్ (మలేసియా), జనవరి 21: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ టైటిల్‌కు చేరువైంది. సెమీ ఫైనల్‌లో ఆమె హాంకాంగ్ క్రీడాకారిణి ఇప్ పయ్ ఇన్‌ను 21-13, 21-10 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఆమె థాయిలాండ్‌కు చెందిన పొర్న్‌పవీ చొచువాంగ్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో చొచువాంగ్ 21-19, 20-22, 21-18 తేడాతో రెండో సీడ్ చెయుంగ్ గాన్ ఈపై విజయం సాధించి సంచలనం సృష్టించింది. జెయింట్ కిల్లర్‌గా ముద్ర వేయించుకున్న ఆమె టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సైనాకు ఫైనల్‌లో ఎంత వరకూ గట్టిపోటీనిస్తుందో చూడాలి. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్ ఇ, ఇన్గ్ కా లాంగ్ ఆన్ టైటిల్ కోసం పోటీపడతారు. మొదటి సెమీ ఫైనల్‌లో హ్యున్ ఇ 21-17, 21-16 తేడాతో టామీ సుగియార్తోను ఓడించాడు. మరో సెమీస్‌లో లాంగ్ ఆన్ 21-18, 21-15 స్కోరుతో ఆంథొనీ సి గిన్టింగ్‌పై విజయం సాధించి ఫైనల్ చేరాడు.