క్రీడాభూమి

7 నుంచి ప్రపంచ కప్ క్వాలిఫయర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 24: శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 7 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనే భారత మహిళా జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. మొత్తం పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ముఖ్యమైనవి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతూ క్వాలిఫయర్స్‌లో అన్ని జట్ల కంటే అగ్రస్థానంలో ఉన్న భారత జట్టుతో పాటు శ్రీలం, ఐర్లాండ్, జింబాబ్వే, థాయలాండ్ జట్లకు గ్రూప్-ఎలో చోటు కల్పించారు. ఈ పోటీల్లో మెరుగ్గా రాణించిన తొలి నాలుగు జట్లకు జూన్ 24 నుంచి జులై 23వ తేదీ వరకు ఇంగ్లాండ్, వేల్స్‌లో జరిగే ఐసిసి మహిళల ప్రపంచ కప్-2017లో పాల్గొనే అవకాశం లభిచనుండగా, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు వచ్చే నాలుగేళ్లు అంతర్జాతీయ వనే్డ హోదా లభిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ముగిసిన ఐసిసి మహిళల చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ తొలి నాలుగు స్థానాల్లో నిలవడంతో ఈ ఏడాది ప్రపంచ కప్ టోర్నీకి ఆ జట్లు నేరుగా అర్హత సాధించాయ.