క్రీడాభూమి

సెమీస్‌కు ఫెదరర్, వీనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విస్ దిగ్గజం, ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను వరుస సెట్ల తేడాతో జర్మనీకి చెందిన మిషా జ్వెరెవ్‌ను మట్టికరిపించాడు. కెరీర్‌లో 17 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన ఫెదరర్ 92 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి 6-1, 7-5, 6-2 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇంతకుముందు నాలుగుసార్లు టైటిళ్లు సాధించిన ఫెదరర్ ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం ఇది 13వ సారి కాగా, మొత్తం మీద అతను గ్రాండ్‌శ్లామ్ టోర్నీల్లో సెమీస్‌కు చేరడం ఇది 41వ సారి. ఈసారి అతను ఫైనల్ బెర్తు కోసం స్విట్జర్లాండ్‌కే చెందిన స్టానిస్లాస్ వావ్రిన్కాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న వావ్రిన్కా క్వార్టర్ ఫైనల్ పోరులో మాజీ ఫైనలిస్టు జో-విల్‌ఫ్రెడ్ సోంగాను మట్టికరిపించాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన వావ్రిన్కా 135 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 7-6(7/2), 6-4, 6-3 తేడాతో ప్రత్యర్థిని ఓడించి ఈ టోర్నీలో మూడోసారి సెమీస్‌కు చేరాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ మూడు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన వావ్రిన్కా ఇప్పుడు గ్రాండ్‌శ్లామ్స్‌లో నాలుగో సారి ఫైనల్‌కు చేరేందుకు మరో మెట్టు దూరంలో నిలిచాడు.
మహిళల సింగిల్స్‌లో..
ఇదిలావుంటే, మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా ‘నల్ల కలువ’ వీనస్ విలియమ్స్ సెమీస్‌లో ప్రవేశించింది. కెరీర్ ముగింపు దశలో ఉన్న 36 ఏళ్ల వీనస్ విలియమ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 7-6(3) సెట్ల తేడాతో రష్యాకు చెందిన 24వ ర్యాంకు క్రీడాకారిణి అనస్తాసియా పవ్‌లుచెన్కోవాపై ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీనస్ సెమీస్‌కు చేరడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫైనల్ బెర్తు కోసం ఆమె అమెరికాకే చెందిన కోకో వాండ్వెఘేతో తలపడనుంది. ఈ టోర్నీలో 13వ సీడ్‌గా బరిలోకి దిగిన వాండ్వెఘే క్వార్టర్ ఫైనల్‌లో 6-4, 6-0 సెట్ల తేడాతో స్పెయిన్‌కు ఏడో సీడ్ క్రీడాకారిణి, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ గార్బిన్ ముగురుజాపై సంచలన విజయం సాధించింది.

చిత్రాలు..స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్

*ఆస్ట్రేలియా ఓపెన్‌లో 14 ఏళ్ల తర్వాత
సెమీస్ చేరిన వీనస్ విలియమ్స్