క్రీడాభూమి

మకావూ ఓపెన్ బాడ్మింటన్ సింధు హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, నవంబర్ 29: భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ పివి సింధు మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ నమోదు చేసింది. రెండు వరుస టైటిళ్లతో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన సింధు ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి మినాత్సు మితానీపై 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు తన కంటే ఆరు స్థానాలు మెరుగైన స్థితిలో కొనసాగుతున్న మితానీపై తొలి సెట్‌ను సులభంగానే సొంతం చేసుకుంది. అయితే, రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో ఆ సెట్‌లో సింధుకు ఓటమి తప్పలేదు. దీనితో చివరిదైన మూడో సెట్ కీలకంగా మారింది. విజేతను ఖరారు చేసే ఆ సెట్‌ను సింధు తన ఖాతాలో వేసుకొని, వరుసగా మూడోసారి మకావూ విజేతగా నిలిచింది.
పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్ జియాన్ హ్యుయెట్ జిన్ 21-11, 13-21, 23-21 తేడాతో రెండో ర్యాంక్ ఆటగాడు తియాన్ హొవెయ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. మహిళల డబుల్స్‌లో జంగ్ యుంగ్ యున్, షిన్ సియూంగ్ చాన్ జోడీతో తలపడిన పున్‌లోక్ యా, సెఇంగ్ సయెట్ జోడీ తొలి సెట్‌ను 21-18 తేడాతో గెల్చుకుంది. రెండో సెట్‌లో చెరి 15 పాయింట్లతో సమవుజ్జీగా నిలిచాయి. ఈ సమయంలో పున్‌లోక్ యా, సయెట్ జోడీ పోటీ నుంచి వైదొలగడంతో యుంగ్ యున్, సియూంగ్ చాన్ జోడీకి టైటిల్ లభించింది. పురుషుల డబుల్స్‌లో బెర్రీ ఆంగ్రియావన్, ర్యాన్ ఆగుంగ్‌సపుత్ర జోడీని 22-20, 21-14 తేడాతో ఓడించిన కోసంగ్ హ్యున్, షిన్ బాక్ చెయెల్ జోడీ టైటిల్‌ను అందుకుంది. షిన్ బాక్ చెయెల్‌కు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ టైటిల్ లభించింది. యూ జంగ్ చయేతో కలిసి బరిలోకి దిగిన అతను 21-18, 21-13 తేడాతో సొల్గున్ చోయ్, ఎయ్ హ్యు వాన్ జోడీపై విజయం సాధించాడు.
chitram...
మకావూ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న
భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు