క్రీడాభూమి

హోరాహోరీకి హేమాహేమీలు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 28: పాతకాపులు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చిరకాల శత్రువులు మరోసారి ఆధిపత్య పోరాటానికి సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే ఓటమిపాలై నిష్క్రమించడంతో, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్‌లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ టైటిల్ రేసులో ముందుకొచ్చారు. అనుకున్న విధంగానే వీరు తమతమ ప్రత్యర్థులను ఓడిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చారు. ఆదివారం జరిగే తుది పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, నాదల్ ఒక గ్రాండ్ శ్లామ్ ఫైనల్‌లో తలపడి ఇప్పటికి ఆరేళ్లయింది. చాలాకాలం తర్వాత తలపడుతున్న ఇద్దరికీ ఈ మ్యాచ్ పలు రకాలుగా కీలకమైంది. కెరీర్‌లో ఇప్పటికే 17 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను అందుకున్న ఫెదరర్ తన సమీప ప్రత్యర్థులతో ఉన్న తేడాను మరింతగా పెంచుకోగలుగుతాడు. ఒకవేళ నాదల్ గెలిస్తే, అతనికి ఇది 15వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ అవుతుంది. ఆల్‌టైం గ్రేట్ ఆటగాళ్లలో ఒకడైన పీట్ సంప్రాస్ (14 టైటిళ్లు)ను మూడో స్థానానికి నెట్టి, రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. అంతేగాక, ఓపెన్ ఎరాలో అన్ని గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కనీసం రెండేసి పర్యాయాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా అతను రికార్డు సృష్టిస్తాడు. మొత్తం టెన్నిస్ చరిత్రలోనే ఇప్పటి వరకూ రాడ్ లెవర్, రాయ్ ఎమర్సన్ మాత్రమే నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీలను కనీసం రెండేసి పర్యాయాలు సాధించారు. అయితే, వీరిద్దరూ ఓపెన్ శకానికి ముందు ఈ ఫీట్ సాధించగా, నాదల్ ఆ రికార్డుకు ఒక విజయం దూరంలో ఉన్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న అతను 17వ ర్యాంక్ ఆటగాడు ఫెదరర్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి.