క్రీడాభూమి

ఫిట్నెస్‌తోనే విజయాలు సాధ్యం: సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 29: ఫిట్నెస్ ఉంటేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన కోల్‌కతా మారథాన్ రన్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన సచిన్ మాట్లాడుతూ, వణిస్తున్న చలిలో, తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో ప్రజలు మారథాన్ కోసం రావడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని అన్నాడు. ఉత్తమ జీవన విధానాన్ని అలవరచుకోవడానికి ఇలాంటి ఈవెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ, ఆరోగ్యంగా ఉంటే జీవన సరిళిలోనూ చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది కూడా ఈ ఈవెంట్‌కు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇలావుంటే, కోల్‌కతా ఫుల్ మారథాన్ టైటిల్‌ను అబ్దుల్ హొస్సేన్ గెల్చుకున్నాడు. అతను లక్ష్యాన్ని రెండు గంటల, 34.02 నిమిషాల్లో చేరాడు. బిశ్వనాథ్ పాల్ (2:39.16 గంటలు), పరితోష్ రాయ్ (2:52.48 గంటలు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కాగా, హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో శుభాంకర్ ఘోష్ (1:09.08 గంటలు), జోమ్‌సింగ్ స్టార్ రాంసీజ్ (1:11.03 గంటలు), ఉత్తమ్ భుజెల్ (1:13.23 గంటలు) మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. మహిళల విభాగంలో మంగలి తమాంగ్ (1:31.13 గంటలు), కింటిమోన్ మార్వెయిన్ (1:33.04 గంటలు), దతేబాంకీన్‌మా మార్వెయిన్ (1:35.38 గంటలు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.