క్రీడాభూమి

విండీస్ చేతిలో ఫిజీ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, జనవరి 31: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 262 పరుగుల భారీ స్కోరుతో ఫిజీని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు సాధించింది. షమెర్ స్ప్రింగర్ 106 పరుగులతో కదంతొక్కగా, గిడ్రాన్ పోప్ 76, జైదీ గులీ (66) అర్ధ శతకాలతో రాణించారు. ఫిజీ బౌలర్లలో కొకాక తికోస్వా 59 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా, 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ ఆరంభించిన ఫిజీ 27.3 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. పెనీ ఉనివగే (29), కెప్టెన్ సల్మో నితుటొగా (12) తప్ప ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. విండీస్ బౌలర్లలో పోప్ 24 పరుగులకు నాలుగు, జోసెఫ్ 15 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
బంగ్లాదేశ్ గెలుపు
స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 114 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 256 పరుగులు చేసింది. అనంతరం స్కాట్‌లాండ్‌ను 47.2 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ చేసి, విజయ భేరి మోగించింది.
ఇతర మ్యాచ్‌ల్లో జింబాబ్వేను ఇంగ్లాండ్ 129 పరుగులతో ఓడించగా, నమీబియా రెండు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

ఆస్ట్రేలియాతో చివరి టి-20లో ఓడిన భారత మహిళలు

సిడ్నీ, జనవరి 31: భారత పురుషులు, మహిళల జట్లు ఆస్ట్రేలియాతో ఆదివారం చివరి, మూడో టి-20 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ విజయభేరి మోగించి, 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే, మహిళల జట్టు చివరి మ్యాచ్‌ని 15 పరుగుల తేడాతో కోల్పోయింది. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లను కైవసం చేసుకోవడంతో, సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకొని విన్నర్స్ ట్రోఫీని స్వీకరించింది. చివరి మ్యాచ్‌లో ఎలిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రతిభ ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ నుంచి రక్షించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. బేత్ మూనీ 34, మెగ్ లానింగ్ 26 పరుగులు చేయగా, ఎలిస్ పెర్రీ అజేయంగా 55 పరుగులు సాధించింది. ఆమె ప్రతిభ కారణంగా ఆస్ట్రేలియాకు గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 36 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.
భారత్ తడబాటు
లక్ష్య సాధనలో భారత జట్టు తడబడింది. 137 పరుగులను సాధించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించి, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేయగలిగింది. వేలస్వామి వనిత 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 24 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌విమెన్ దారుణంగా విఫలమయ్యారు. కాగా, బ్యాటింగ్‌లో రాణించి అర్ధ శతకాన్ని సాధించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరచింది. ఆమె 4 ఓవర్లు బౌల్ చేసి, 12 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చింది. రేన్ ఫారెల్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది.

హెచ్‌ఐఎల్‌లో మళ్లీ ఓడిన దబాంగ్

రాంచీ, జనవరి 31: దబాంగ్ ముంబయ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో మరో పరాజయాన్ని ఎ దుర్కొంది. కళింగ లాన్సర్స్‌తో ఆదివారం జరిగిన పో రులో ఈ జట్టు 4-6 తేడాతో ఓడింది. ఫలితంగా, ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో చివరి స్థానంలో ని లిచింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు కొంత వరకూ రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయ. అయతే, కళిం గ జట్టు క్రమంగా దూకుడును పెంచింది. ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులకు దిగింది. 20వ నిమిషంలో గుర్జీం దర్ సింగ్, 28వ నిమిషంలో ఆడం డిక్సన్, 33వ నిమి షంలో లలిత్ ఉపాధ్యాయ గోల్స్ సాధించారు. వరుస గోల్స్‌తో దూసుకెళుతున్న కళింగను నిలువరించే ప్ర యత్నంలో 41వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్, 47వ ని మిషంలో గుర్జాంత్ సింగ్ గోల్స్ సాధించారు. ఈ రెం డు ఫీల్డ్ గోల్స్ కావడంతో అదనంగా మరో రెండు బో నస్ గోల్స్ ఆ జట్టుకు లభించాయ. కాగా, కళింగ ఆట గాడు క్విర్జిన్ కాస్పర్స్ 55వ నిమిషంలో గోల్ సాధించా డు. మొత్తం మీద కళింగకు నలుగురు ఆటగాళ్లు గోల్స్ అందిస్తే, రెండు ఫీల్డ్ గోల్స్ నమోదు కావడంతో, రెం డు బోనస్ గోల్స్ లభించి, 6-4 తేడాతో విజయాన్ని న మోదు చేసింది. లీగ్ దశను మొదటి నాలుగు స్థానాల్లో పూర్తి చేసిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయ. ప్ర స్తుతం డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ 21 పాయం ట్లతో అగ్రస్థానంలో ఉండగా, కళింగ 17 పాయంట్లతో రెండో, ఢిల్లీ వేవ్‌రైడర్స్ 16, జెపీ పంజాబ్ వారియర్స్ 12 పాయంట్లతో 3, 4 స్థానాల్లో ఉన్నాయ.