క్రీడాభూమి

రసెల్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 1: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై ఏడాది సస్పెన్షన్ వేటు పడింది. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతను తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. 2015లో వరుసగా మూడు పర్యాయాలు తాను ఎప్పుడు, ఎక్కడ ఉంటాననే విషయాన్ని అతను తెలియచేయలేదని వాడా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ముందుగా సమాచారం ఇవ్వని వారిని డోప్ దోషులుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే, రసెల్‌పై చర్యకు ప్రతిపాదించామని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, వాడా నిబంధనలను నిర్లక్ష్యం చేసిన 28 ఏళ్ల రసెల్‌పై, వాడా ప్రతిపాదన ప్రకారం చర్య తీసుకుంటున్నట్టు జమైకా డోపింగ్ నిరోధక విభాగం (జెఎడిఎ) తెలిపింది. అతనిని ఏడాది పాటు అన్ని స్థాయి క్రికెట్ పోటీల నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, జెఎడిఎ నిర్ణయంపై అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఆస్ట్రేలియాలో రసెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న టి-20 క్రికెట్ క్లబ్ సిడ్నీ థండర్ జనరల్ మేనేజర్ నిక్ కమిన్స్ ప్రకటించాడు. అయితే, నిబంధనలు, శిక్షలు ఎవరికైనా ఒకటేనని, ఈ విషయంలో రసెల్‌కు మినహాయింపు ఉండదని అన్నాడు.

బెంగాల్ చేతిలో అస్సాం చిత్తు

కోల్‌కతా, ఫిబ్రవరి 1: ముస్తాక్ అలీ అంతర్ రాష్ట్ర టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఈస్ట్‌జోన్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో అస్సాంను బెంగాల్ పది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. జాతీయ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి అజేయంగా అర్ధ శతకాలు సాధించి బెంగాల్‌ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అస్సాం 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కెప్టెన్ అరుణ్ కార్తీక్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగాల్ బౌలర్ సాయన్ ఘోష్ 30 పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ను ఓపెనర్లు సాహా, శ్రీవత్స్ ఒక్క వికెట్ కూడా నష్టం లేకుండా గెలిపించారు. ఈ జట్టు ఇంకా 24 బంతులు (నాలుగు ఓవర్లు) మిగిలి ఉండగానే విజయభేరి మోగించే సమయానికి సాహా 74 (45 బంతులు, 11 ఫోర్లు, ఒక సిక్సర్), శ్రీవత్స్ 71 (52 బంతులు, 10 ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు.
కాగా ఈదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో త్రిపుర 24 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు త్రిపుర 19.5 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్‌కాగా, జార్ఖండ్ లక్ష్యాన్ని ఛేదించలేక, 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులకు పరిమితమైంది.
ధర్మశాలలో నార్త్‌జోన్ విభాగంలో, ధర్మశాలలో జరిగిన మొదటి మ్యాచ్‌లో హర్యానాపై ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్యానా 7 వికెట్లకు 114 పరుగులు చేయగా, ఢిల్లీ 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి గమ్యాన్ని చేరింది. ఇదే విభాగంలో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ ఆరు పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్‌ను ఓడించింది. పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 129 పరుగులు చేయగా, సర్వీసెస్ 8 వికెట్లకు 123 పరుగులకు పరిమితమైంది.
వడోదరలో వెస్ట్‌జోన్ విభాగంలో మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో రంజీ చాంపియన్ గుజరాత్‌ను బరోడా 15 పరుగుల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో సౌరాష్టన్రు ముంబయి ఐదు వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసింది.