క్రీడాభూమి

అండర్-19 వరల్డ్ కప్ రిషభ్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, ఫిబ్రవరి 1: వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ విజృంభించి 24 బంతుల్లోనే 78 పరుగులు సాధించడంతో, అండర్-19 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తుచేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్ చివరి లీగ్ పోటీని వామప్ మ్యాచ్‌గా స్వీకరించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48 ఓవర్లలో 169 పరుగులు సాధించింది. సందీప్ సుందర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆవేష్ ఖాన్ 34 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 20 పరుగులకు రెండు, మాయాంక్ దాగర్ 32 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లకు 175 పరుగులు సాధించగా, రిషభ్ పంత్ 78 పరుగులు సాధించి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సర్ఫ్‌రాజ్ ఖాన్ అజేయంగా 21 పరుగులు చేసి, భారత్‌కు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు

క్లబ్ చాంపియన్‌షిప్‌లో
పారిస్ రికార్డు

పారిస్, ఫిబ్రవరి 1: క్లబ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పారిస్ సెయింట్ జర్మెయిన్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. సెయింట్ ఎటియెనాతో జరిగిన లీగ్-1 మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచింది. క్లబ్ చాంపియన్‌షిప్స్‌లో పారిస్‌కు ఇది వరుసగా 13వ విజయం. ఇతరత్రా టోర్నీలను కూడా పరిగణలోకి తీసుకుంటే 32వది. గత ఏడాది మార్చి 15న బొర్డెక్స్ చేతిలో 2-3 తేడాతో ఓడిన తర్వాత పారిస్ ఇప్పటి వరకూ ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు.
భారీ బందోబస్తు
ఇలావుంటే, ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గత నెల 13న పారిస్‌పై ఐసిస్ ఉగ్రవాదులు విరుచుకుపడిన సంఘటనలో 129 మంది మృతి చెందగా 350 మందికిపైగా గాయపడ్డారు. ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పారిస్ నగరం బాంబు పేలుళ్లతో అట్టుడికింది. ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడ్ డి ఫ్రాన్స్‌కు సమీపంలోనూ దాడి జరిగింది. ఉగ్రవాద దాడులతో దిగ్భ్రాంతికి గురైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హోలాండ్ దేశంలో ఎమర్జెన్సీ విధించాడు. ఫలితంగా దేశంలో జరగాల్సిన చాలా మ్యాచ్‌లు నిలిచిపోయాయి. కాగా లీగ్-1, లీగ్-2 ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఫ్రాన్స్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ఆరంభం మాత్రమేనని, అమెరికాను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ఐసిస్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఫ్రెంచ్ సర్కారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిది. లీగ్-1, లీగ్-2 పోటీలు జరిగే ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.

హాకీ ఇండియా లీగ్
ఢిల్లీని ఓడించిన యుపి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా సోమవారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో యుపి విజార్డ్స్ జట్టు 6-4 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. మ్యాచ్ 19వ నిమిషంలోనే రూపీందర్ పాల్ సింగ్ చేసిన గోల్‌తో యుపి ఖాతా తెరచింది. ఆతర్వాత చిగ్లెన్‌సనా సింగ్ 54, జెమీ డయర్ 55 నిమిషాల్లో ఫీల్డ్ గోల్స్ సాధించడంతో ఢిల్లీకి రెండు బోనస్ గోల్స్ కూడా లభించాయి. 58వ నిమిషంలో గంజాలో పీలట్ ఒక గోల్ సాధించాడు. ఢిల్లీ తరఫున జస్టిన్ రీడ్ రాస్, తల్వార్ సింగ్ ఫీల్డ్ గోల్స్ చేయడంతో, ఆ జట్టు ఖాతాలో నాలుగు గోల్స్ చేరాయి.