క్రీడాభూమి

నాగపూర్ పిచ్ నాసిరకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 1: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టుకు వేదిక అయిన నాగపూర్ పిచ్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నాసిరకమైనదిగా పేర్కొనడం బిసిసిఐకి ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఈ పిచ్ ఎలా ఉందనే దానిపై ఐసిసి పిచ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష జరపనుంది. ఈ ప్రక్రియకు చెందిన 3 వ క్లాజ్ ప్రకారం ఐసిసి మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో నాగపూర్ పిచ్ తీరుపట్ల మ్యాచ్ అఫీషియల్స్ ఆందోళనను తెలియజేస్తూ ఐసిసికి ఒక నివేదిక సమర్పించాడు. ఈ నివేదికను ఇప్పుడు బిసిసిఐకి కూడా పంపిస్తున్నారు. దీనిపై బిసిసిఐ 14 రోజుల్లోగా తన స్పందనను అందజేయాల్సి ఉంటుంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సొంత అసోసియేషన్ కూడా అయిన నాగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పిచ్ మొదటిరోజునుంచే స్పిన్‌కు అనూలించడంతో అయిదు రోజుల టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం తెలిసిందే. శశాంక్ మనోహర్ ప్రస్తుతం ఐసిసి చైర్మన్ కూడా కావడం గమనార్హం. బిసిసిఐ తన సమాధానాన్ని సమర్పించిన తర్వాత ఐసిసి జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్, ఐసిసి చీఫ్ మ్యాచ్ రెఫరీ రంజన్ మదుగలేలు కలిసి మ్యాచ్ వీడియో దృశ్యాలతో పాటుగా సాక్ష్యాధారాలను పరిశీలించాక పిచ్ నాసిరకంగా ఉందా లేదా, ఉంటే పెనాల్టీ విధించాలా అనే దానిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఈ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చేవరకు ఐసిసి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదు. గత నెల 25నుంచి 27 వరకు భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు జరిగిన నాగపూర్ పిచ్ తీరుపై ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్, ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్ వాఘన్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శించడం తెలిసిందే.

స్పిన్నర్లకు గౌరవం దక్కడం లేదు
అమిత్ మిశ్రా అసంతృప్తి

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: సఫారీలతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌ల తీరుపై చర్చ కారణంగా భారతీయ స్పిన్నర్ల సామర్థ్యానికి లభించాల్సినంత గుర్తింపు లభించడం లేదని అమిత్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేసాడు. మీకు లభించాల్సినంత క్రెడిట్ లభించలేదని మీకు అనిపిస్తోందా అని మంగళవారం విలేఖరులుప్రశ్నించినప్పు మిశ్రా ముక్కుసూటిగా అవుననే సమాధానమిచ్చాడు. ‘పిచ్‌లపై విపరీతంగా చర్చిస్తూ మాకు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. మేము సాధించిన దాన్ని గుర్తించి, మరింతగా హైలైట్ చేసి ఉండాల్సింది. భారత్‌లో పరిస్థితులు 15 ఏళ్లుగా ఎప్పుడూ ఇలాగే ఉంటున్నాయి. ఇప్పుడేమీ కొత్త కాదు. అంతేకాదు మేము శ్రీలంక వెళ్లినప్పుడు అక్కడ మాకు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లే లభించాయి. అక్కడ కూడా మేము బాగానే బౌల్ చేసాం’ అని అన్నాడు. స్పిన్నర్లు బాగా బౌల్ చేసినప్పుడు కనీసం వాళ్లను పొగిడితే బాగుంటుందని భావిస్తున్నానని, అయితే తమ కెప్టెన్ కోహ్లీ తమకు అండగా నిలిచినందుకు సంతోషంగా ఉందని మిశ్రా చెప్పాడు.