క్రీడాభూమి

గంభీర్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: గౌతం గంభీర్ విజృంభణకు శిఖర్ ధావన్ మద్దతు తోడు కావడంతో, ముస్తాక్ అలీ టి-20 అంతర్ మండల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం సౌత్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌ని నార్త్‌జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుంది. టాస్ గెలిచిన నార్త్‌జోన్ ఛేజింగ్‌కే మొగ్గు చూపింది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. రికీ భుయ్ 37 బంతుల్లో 50 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, మాయాంక్ అగర్వాల్ (32), విజయ్ శంకర్ (34 నాటౌట్) కూడా చక్కటి ప్రతిభ కనబరిచారు. నార్త్ బౌలర్లు ఆశిష్ నెహ్రా, మాయాంక్ డగార్ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. శిఖర్ ధావన్ 38 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50, గౌతం గంభీర్ 51 బంతుల్లో, 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి, నార్త్ విజయాన్ని సులభతరం చేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో, మిగతా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారిపై ఒత్తిడి ఏర్పడలేదు. రిషభ్ పంత్ 33, అమిత్ పచారా 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, నార్త్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు.
వెస్ట్‌ను ఓడించిన సెంట్రల్
మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్‌ను సెంట్రల్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించింది. ఆదిత్య తారే (40), దీపక్ హూడా (49 నాటౌట్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఆతర్వాత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు సాధించి, విజయభేరి మోగించింది. హర్‌ప్రీత్ సింగ్ 42 బంతుల్లో 62, మహేష్ రావత్ 22 బంతుల్లో 30 (నాటౌట్) పరుగులు చేసి సెంట్రల్ విజయంలో కీలక భూమిక పోషించారు.

చిత్రం..గౌతం గంభీర్