క్రీడాభూమి

ఆల్‌రౌండర్లకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 19: ఈసారి ఐపిఎల్‌లో ఆల్‌రౌండర్లకు ఫ్రాంచైజీలు పెద్దపీట వేయడం ఖాయం. టి-10 ఫార్మాట్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ కంటే ఆల్‌రౌండర్లు ఉంటేనే మేలన్న విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అందుకే, ఈసారి ఆల్‌రౌండర్లకు ఫ్రాంచైజీలు ప్రాధాన్యం ఇస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆతర్వాతి ఆస్థినం ఫాస్ట్ బౌలర్లది. స్పిన్నర్లకు భారీ ధర పలికే అవకాశం లేదని అంటున్నారు. బ్యాట్స్‌మెన్‌కు ఫ్రాంచైజీలు ఈసారి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేయకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ఆదాదాపు అన్ని ఫ్రాంచైజీల్లోనూ సమర్థులైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మరో రకంగా చెప్పాలంటే, ఏ ఫ్రాంచైజీకీ ఇప్పుడు అదనపు బ్యాట్స్‌మన్ అవసరం లేదు.
11 మంది రిలీజ్!
నిరుడు ఐపిఎల్‌లో ఎనిమిది జట్లు పోటీపడితే, ఏడో స్థానంలో నిలిచిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఏకంగా 11 మందిని రిలీజ్ చేసింది. అంతేగాక, మహేంద్ర సింగ్ ధోనీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించింది. మొత్తం మీద ఈసారి వేలానికి ఎక్కువ మందిని అందుబాటులో ఉంచిన జట్టు ఇదే. వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు కావడం గమనార్హం. కాగా, ఇప్పటికే ఈ జట్టు మాయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది. ఆటగాళ్ల ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి అతనిని కొనుగోలు చేసింది. స్మిత్ నాయకత్వం వహించనున్న ఆ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ, ఆజింక్య రహానే, మాయాంక్ అగర్వాల్, ఫఫ్ డు ప్లెసిస్, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, రవిచంద్రన్ అశ్విన్, ఈశ్వర్ పాండే, అశోక్ దిండా, ఆడం జంపా వంటి సమర్థులున్నారు. ఆ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. నలుగురు విదేశీ క్రీడాకారులను తీసుకోవచ్చు. ఆ జట్టు వద్ద ఖర్చు చేయడానికి 17.5 కోట్ల రూపాయలున్నాయి.
స్పిన్నర్ కోసం లయన్స్ వేట
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ మాదిరిగానే నిరుడే ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ జట్టు సమర్థుడైన స్పిన్నర్ కోసం వేట మొదలుపెట్టింది. ప్రవీణ్ తంబే స్థానాన్ని భర్తీ చేయగల స్పిన్నర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసే అవకాశం ఉంది. సురేష్ రైనా నాయకత్వం వహిస్తున్న లయన్స్ జట్టులో బ్రెండన్ మెక్‌కలమ్, డ్వేయిన్ స్మిత్, దినేష్ కార్తీక్, డ్వెయిన్ బ్రేవో, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, జేమ్స్ ఫాల్క్‌నెర్, శివిల్ కౌశిక్, ప్రవీణ్ కుమార్, ధవళ్ కులకర్ణి వంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఈ జట్టు అత్యధికంగా 11 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. వీరిలో ముగ్గురు విదేశీయులకు అవకాశం ఉంటుంది. 14.35 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి.
పటిష్ఠంగా ముంబయి
స్పాట్ ఫిక్సింగ్ కేసులో సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో ఐపిఎల్‌లోకి వచ్చిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ మాత్రమే ఆటగాళ్ల కూర్పు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మిగతా జట్లకు దాదాపుగా ఆ సమస్య లేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్, నిరుడు ప్లే ఆఫ్ దశకు చేరుకోలేకపోయినప్పటికీ, కాగితంపై చూస్తే పటిష్టంగానే కనిపిస్తున్నది. లెండల్ సిమన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, కీరన్ పోలార్డ్, జొస్ బట్లర్, హార్దిక్ పాండ్య, హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ వంటి సమర్థులు ఈ జట్టులో ఉన్నారు. కాగా, ఈ ఫ్రాంచైజీకి ఏడుగురు ఆటగాళ్లను (ముగ్గురు విదేశీయులు) కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేతిలో 11.55 కోట్ల రూపాయలు ఉంటాయి.
కోల్‌కతా చేతిలో రూ. 19.75 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ నిరుడు నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. గౌతం గంభీర్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టుకు రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, షకీల్ అల్ హసన్, సునీల్ నారైన్, ఉమేష్ యాదవ్ తదితరుల అండ ఉంది. ఈ జట్టు మరో 14 మంది ఆటగాళ్లను (ఆరుగురు విదేశీ క్రికెటర్లను) కొనవచ్చు. ఈ జట్టు వేలం కోసం 19.75 కోట్ల రూపాయలను ఖర్చు చేయవచ్చు.
డిఫెండింగ్‌గా సన్‌రైజర్స్..
డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో కర్న్ శర్మ, ఇయాన్ మోర్గాన్, ట్రెంట్ బౌల్ట్ తదితరులున్నారు. ప్రస్తుతం ఆ జట్టులో 17 మంది ఆటగాళ్లున్నారు. వారిలో ఐదుగురు విదేశీయులు. డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తున్న సన్‌రైజర్స్‌లో శిఖర్ ధావన్, మోజెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, బెన్ కట్టింగ్, దీపక్ హూడా, ఆశిష్ నెహ్రా, ముష్ఫికర్ రహీం, భువనేశ్వర్ కుమార్ వంటి సమర్థులున్నారు. ఇంకా ఈ జట్టు పది మందిని (నలుగురు విదేశీయులను) వేలంలో కొనవచ్చు. 20.9 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేయవచ్చు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సన్‌రైజర్స్ ఈసారి అదే స్థాయిలో రాణిస్తుందా? టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అన్నది వేచిచూడాలి.
కోహ్లీ కెప్టెన్సీనే అండ
నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీని కొండంత అండగా చెప్పుకోవాలి. ఈ జట్టులో క్రిస్ గేల్, లోకేష్ రాహుల్, ఎబి డివిలియర్స్, కేదాన్ జాదవ్, యుజువేంద్ర చాహల్, మిచెల్ స్టార్క్ వంటి సమర్థులు ఉన్నారు. హర్షల్ పటేల్, మన్దీప్ సింగ్, శామ్యూల్స్ బధ్రీ, ట్రావిస్ హెడ్ తదితరులు చాలా మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తున్నదంటే, ఈ జట్టు ఎంత బలంగా ఉందో ఊహించుకోచ్చు. బెంగళూరుకు ఇంకా ఏడుగురు ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. మిచెల్ స్టార్క్ ఈసారి ఐపిఎల్‌లో ఆడరాదని నిర్ణయంచుకోవడంతో, ఇద్దరు విదేశీయులకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి వేలానికి ముందు ఈ జట్టు వద్ద 12.82 కోట్ల రూపాయలున్నాయ. ఐదు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన స్టార్క్ వైదొవగడంతో, ఆ జట్టు వద్ద మొత్తం 17.82 కోట్ల రూపాయలకు పెరిగింది.
పంజాబ్ రాణిస్తుందా?
నిరుడు వరుస వైఫల్యాలతో అల్లాడి, చివరికి అట్టడుగు స్థానానికి పడిపోయి పరువుపోగొట్టుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈసారి రాణిస్తుందా? లేక మరోసారి అదే రీతిలో వైఫల్యాలను ఎదుర్కొంటుందా అన్న ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి. టెస్టు క్రికెటర్‌గా ముద్రపడిన మురళీ విజయ్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో షాన్ మార్ష్, గ్లేన్ మాక్స్, డేవిడ్ మిల్లర్ వంటి కొంత మంది మాత్రమే స్టార్లు ఉన్నారు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా టి-20 ఫార్మాట్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన సందర్భాలు తక్కువ. గుర్‌కీతర్ సింగ్, మార్కస్ స్టొయినిస్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ తదితరులు తమపై అభిమానులు ఉంచిన నమ్మకానికి తగినట్టు ఆడలేకపోతున్నారు. ఈ జట్టు ఇంకా ఎనిమిది మంది ఆటగాళ్లు తీసుకోవచ్చు. వీరిలో నలుగురి కంటే ఎక్కువ మంది విదేశీ క్రికెటర్లకు చోటు ఉండదు. 23.35 కోట్ల రూపాయలు చేతిలో ఉన్నాయి.
యువ ఢిల్లీ!
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జీన్ పాల్ డుమినీ నాయకత్వంలోని ఈ జట్టు నిరుడు ఆరో స్థానానికి పరిమితమైంది. ఈసారి ఎంత వరకు రాణిస్తుందో చూడాలి. క్వింటన్ డి కాక్, శ్రేయాస్ అయ్యర్, కార్లొస్ బ్రాత్‌వెయిట్, క్రిస్ మోరిస్ తదితర మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అందరి దృష్టి రిషభ్ పంత్, కరుణ్ నాయర్, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ తదితరులపై కేంద్రీకృతమైంది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ టి-20 ఫార్మాట్‌లో ఏ విధంగా ఆడతాడన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అమిత్ మిశ్రా ఫిట్నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ జట్టు వేలంలో 10 మంది వరకు ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. 23.10 కోట్ల రూపాయలు ఈ జట్టు పర్సులో ఉన్నాయి.