క్రీడాభూమి

శ్రేయాస్ అజేయ ‘డబుల్’ భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: భారత్ ‘ఎ’ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అజేయ డబుల్ సెంచరీతో రాణించడాన్ని మినహాయిస్తే, ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ చివరి రోజు ఆట పేలవంగా సాగి, డ్రాగా ముగిసింది. నాలుగు వికెట్లకు 176 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన భారత్ ‘ఎ’ 403 పరుగులకు ఆలౌటైంది. 306 నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ 210 బంతులు ఎదుర్కొని, 27 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 202 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరిలో కృష్ణప్ప గౌతం ఆసీస్ బౌలింగ్‌ను ఎదురునిలిచి 74 పరుగులు సాధించాడు. నాథన్ లియాన్ 162 పరుగులకు నాలుగు వికెట్లు పడగొడితే, స్టెఫెన్ ఒకీఫ్ 101 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి, 36 ఓవర్లలో నాలుగు వికెట్లకు 110 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 35, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 37 చొప్పున పరుగులు సాధించారు.

ఈ సీజన్‌కు స్టార్క్ దూరం!
బెంగళూరు: ఆస్ట్రేలియా పాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈసారి ఐపిఎల్‌లో ఆడడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తన ఒప్పందాన్ని ముగించుకున్న అతను, ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆడరాదని నిర్ణయించుకున్నాడని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. నిరుడు ఐపిఎల్ వేలంలో స్టార్క్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది.

అధికారులకు
నో ఎంట్రీ!

న్యూఢిల్లీ: ఐపిఎల్ వేలంలో కీలక పాత్ర పోషిస్తూ, ఎప్పుడూ హడావుడిగా కనిపించే బిసిసిఐ అధికారులకు ఈసారి బ్రేక్‌పడింది. సికె ఖన్నా, అమితాబ్ చౌదరి, అనిరుద్ధ్ చౌదరిసహా బిసిసిఐ అధికారులు ఎవరూ బెంగళూరులో సోమవారం జరిగే వేలానికి హాజరుకారాదని సుప్రీం కోర్టు ఇటీవల నియమించిన నలుగురు సభ్యులతో కూడిన పాలనాధికారుల బృందం స్పష్టం చేసింది. బిసిసిఐలో ఖన్నా సీనియర్ ఉపాధ్యక్షుడుకాగా, అనిరుద్ధ్ కోశాధికారిగా ఉన్నాడు.