క్రీడాభూమి

పుజారా, ఇశాంత్‌లకు ఫ్రాంచైజీల షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: భారత టెస్టు క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మలకు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. అవసరమైతే ఓపెనర్‌గా, లేకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సేవలు అందించే సత్తావున్న పుజారాకు 50 లక్షల రూపాయలు, ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు రెండు కోట్ల రూపాయలను బేస్ ప్రైస్‌గా నిర్ణయించారు. కానీ, అదే ధరకు తీసుకోవడానికి కూడా ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. వీరిద్దరూ టెస్టులకు తప్ప, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు పనికిరారన్న ముద్రపడ్డారు. అందుకే, వీరి పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదని విశే్లషకులు అంటున్నారు. అదీ నిజమే.

చిత్రం..బెంగళూరులో సోమవారం నాటి ఐపిఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీనీ ఆకర్షించలేకపోయన
టీమిండియా ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మ