క్రీడాభూమి

ఎదురుదాడి చేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియాపై భారత జట్టు ఎదురుదాడి చేస్తుందని ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీ మారథాన్‌ను జెండా ఊపి ఆరంభించిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ పోటీకి దిగిన తర్వాత జయాపజయాలు సాధారణమని వ్యాఖ్యానించాడు. ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రానే సిరీస్ చేజారిపోయిందని అనుకోకూడదని అన్నాడు. ప్రస్తుత టీమిండియా చాలా బలంగా ఉందని, ఆటగాళ్ల గురించి తనకు బాగా తెలుసునని చెప్పాడు. మిగతా మూడు టెస్టుల్లో భారత్ ఎదురుదాడి చేస్తుందని, గట్టిపోటీనిస్తుందని అన్నాడు. మ్యాచ్ మూడో రోజు టీ విరామం తర్వాత టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలడం ఆశ్చర్యం కలిగిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో నేర్చుకున్న పాఠాలు భారత ఆటగాళ్లకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాని అన్నాడు.
జయంత్, ఇశాంత్‌లను తప్పించండి: అజర్
న్యూఢిల్లీ: ఇశాంత్ శర్మ, జయంత్ యాదవ్‌లను తప్పించాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం అతను పిటిఐతో మాట్లాడుతూ, అన్ని పిచ్‌లు పుణేలో మాదిరి ఉండవని అన్నాడు. రెండో టెస్టు జరిగే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పరిస్థితి వేరుగా ఉంటుందని, అందుకే, జయంత్, ఇశాంత్‌లను తుది జట్టు నుంచి తప్పించాలని తాను జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నానని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్‌కు జట్టులో చోటు కల్పించాలని అన్నాడు. ఇశాంత్ శర్మ స్థానంలో బంతిని స్వింగ్ చేయగల సత్తావున్న భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలని అతను భారత క్రికెట్ అధికారులకు సలహా చెప్పాడు.

చిత్రం..ఢిల్లీ మారథాన్‌ను ప్రారంభిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్