క్రీడాభూమి

‘లోధా’ సిఫార్సులను అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళనపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయాలని బిసిసిఐకి సూచించింది. అయితే, లోధా కమిటీ సిఫార్సులను ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయడం సాధ్యం కాదని శశాంకర్ మనోహర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిసిసిఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఈనెల 7వ తేదీన న్యాయ నిపుణుల కమిటీ సమావేశమవుతుందని, అందులో చర్చించిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటి వరకూ గడువు ఇవ్వాలని కోరింది. బిసిసిఐ వాదన విన్న తర్వాత, కేసును మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
భారీ మార్పులు: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే, బిసిసిఐలో భారీ మార్పులు తప్పవు. ప్రస్తుతం అధికారం లో ఉన్న చాలా మంది అధికారులకు ఉద్వాసన ఖాయమవుతుంది. అంతేగాక, బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాల్సి వస్తుం ది. చాలా దేశాల్లో మ్యాచ్‌లపై పందేలు కాయడాన్ని చట్టం అనుమతిస్తుంది. స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి సమస్యలకు తెరపడాలంటే, బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న లోధా కమిటీ సూచన ఎంత వరకు అమలవుతుందో చూడాలి. మొత్తం మీద ఈ కమిటీ సిఫార్సులు భారత క్రికెట్‌ను తీవ్రంగానే ప్రభావితం చేయనున్నాయ.

కీర్తీ ఆజాద్‌పై హెచ్‌ఐ కేసు!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు చేసి, సస్పెన్షన్‌కు గురైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్‌పై మరో కేసు దాఖలు కాంది. ఈసారి హాకీ ఇండియా (హెచ్‌ఐ) అతనిపై పరువునష్టం కేసు పెట్టేందుకు సిద్ధమైంది. పదేపదే ఆరోపణలు గుప్పిస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆజాద్‌ను విడిచిపెట్టేది లేదని హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బత్రా, ఇతర కార్యవర్గ సభ్యులు అంటున్నట్టు సమాచారం. వౌనంగా ఉంటే ఆజాద్ చేసిన ఆరోపణలు నిజమేనన్న అనుమానం తలెత్తుతుందని, కాబట్టి అతనిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించినట్టు హెచ్‌ఐ వర్గాలు అంటున్నాయి.