క్రీడాభూమి

జర్మన్ ఓపెన్ బాడ్మింటన్‌లో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హెయిమ్ అన్‌డెర్ రర్ (జర్మనీ), మార్చి 3: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో 12వ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ శుక్రవారం తెల్లవారు జామున ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ ఆరంభంలో మడమ గాయం నుంచి తేరుకుని బాగానే ఆడి తొలి గేమ్‌లో 12-6 ఆధిక్యత సాధించిన శ్రీకాంత్ ఆ తర్వాత తన కంటే ఎంతో బలవంతుడైన చెన్ ముందు నిలవలేకపోయాడు. ఫలితంగా ఆ గేమ్‌ను 19-21 తేడాతో కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ తీవ్రంగానే ప్రతిఘటించి 16-12 ఆధిక్య సాధించినప్పటికీ పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించిన చెన్ 20-22 తేడాతో ఆ గేమ్‌ను కూడా కైవసం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శ్రీకాంత్ ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి పూర్తిగా తెరపడింది. అంతకుముందు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన సుభాంకర్ డే, హర్షిత్ అగర్వాల్ చేతులెత్తేశారు. సుభాంకర్ డే 14-21, 8-21 గేముల తేడాతో హాంకాంగ్‌కు చెందిన ఐదో సీడ్ ఆటగాడు యంగ్ క లాంగ్ చేతిలో ఓటమి పాలవగా, హర్షిత్ అగర్వాల్ కూడా 15-21, 11-21 హాంకాంగ్‌కే చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు హు యున్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.