క్రీడాభూమి

కోహ్లీ స్లెడ్జింగ్‌ను ఎంజాయ్ చేశా : రెన్షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 5: భారత పర్యటనలో వయసుకు మించిన పరిణతితో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రెన్షా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌నుంచి ఎదురైన స్లెడ్జింగ్‌ను కూడా అంతే దీటుగా ఎదుర్కొన్నాడు. నిజానికి బెంగళూరు టెస్టు రెండో రోజు కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను పదే పదే మాటల తూటాలతో రెచ్చగొడుతూనే వచ్చాడు. తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో తరచూ మాటల యుద్ధానికి దిగిన కోహ్లీ నిలకడగా ఆడుతున్న రెన్షా ఏకాగ్రతను దెబ్బతీయడానికి కూడా ప్రయత్నించాడు. ఈ క్రమంలో పుణె టెస్టులో రెన్షా టాయిలెట్ బ్రేక్ తీసుకోవడాన్ని ప్రస్తావించడం ద్వారా అతడిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే రెన్షా ఆ ఒత్తిడిని విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా 60 పరుగులు సాధించాడు. రెండో ఆట ముగిసిన తర్వాత మీడియా ఇదే విషయాన్ని అడగ్గా, ‘కోహ్లీ మాటలను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించా. ఎందుకంటే అతని మాటల్లో కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి. పుణె టెస్టులో చేసినట్లుగా మరోసారి టాయిలెట్‌కు పరుగెత్తమని మాత్రమే కోహ్లీ అన్నాడు’ అని రెన్‌షా చెప్పాడు.