క్రీడాభూమి

యువకులకు పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే టీమిండియా ఎంపిక శుక్రవారం జరగనుండగా, ఎవరికి స్థానం దక్కుతుంది? ఎవరిని దురదృష్టం వెక్కిరిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ యువకులకు పెద్దపీట వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, ప్రయోగాలు చేయడానికి సహజంగా ఇష్టపడని మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయాలను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటే, చాలా మంది సీనియర్లకు జట్టులో స్థానం లభించడం ఖాయం. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టులోని ఆటగాళ్లందరినీ ఎలాంటి మార్పు లేకుండా టి-20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌లో పాల్గొన్న ఆజింక్య రహానే, మనీష్ పాండే మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఏడో స్థానానికి స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. టి-20 వరల్డ్ కప్‌తోపాటు, అంతకంటే ముందు జరిగే ఆసియా కప్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనే జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు అనుసరించబోయే విధానాలను తెలుసుకోవడానికి కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. శ్రీలంకతో సిరీస్ నుంచి స్టార్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఫలితంగా, ఫామ్‌లో ఉన్న మనీష్ పాండేకు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్థానం లభించింది. అయితే, ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ పోటీలకు కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తాడు. ఫలితంగా లంకతో సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టు నుంచి కనీసం ఒకరిపై వేటు పడడం ఖాయం. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్న. కోహ్లీ స్థానంలో వచ్చాడు కాబట్టి మనీష్ పాండేపైనే వేటు వేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లంకతో సిరీస్ ఈనెల 9న పుణేలో మొదలవుతుంది. కానీ, టి-20 వరల్డ్ కప్, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు జట్టు ఎంపిక శుక్రవారం జరుగుతుంది. ఫామ్‌ను నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే మనీష్ పాండేను తప్పించ వద్దన్న డిమాండ్ కూడా ఉంది.
ధోనీకే కెప్టెన్సీ!
టీమిండియాకు నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోనీనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతనిని తప్పించి, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పచెప్పి, ప్రయోగాలు చేసేందుకు సెలక్టర్లు సిద్ధంకాకపోవచ్చు. కాగా, ధోనీ, కోహ్లీతోపాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ జట్టులో తమతమ స్థానాలను ఖరారు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనితో స్థానం కోల్పోయేది ఎవరన్న ప్రశ్నకు రహానే, మనీష్ పాండే పేర్లే వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టుకు అండగా నిలిచి, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమేగాక, పరుగులను సాధించిపెట్టగల సమర్థుడిగా పేరు తెచ్చుకున్న రహానే పట్ల సెలక్టర్లకు నమ్మకం లేకపోలేదు. అయితే, రహానే సామర్థ్యంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధోనీ అనుమానం వ్యక్తం చేయడం, అతను జట్టు ప్రయోజనాల కోసం ఆడడం లేదన్న సంకేతాలు ఇవ్వడం వంటి అంశాలు సెలక్టర్ల అలోచనా ధోరణిని మార్చే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో రహానే ప్రతిభను ఎవరూ శంకించలేరు. కానీ, ధోనీ ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టి-20 మ్యాచ్‌ల్లోనూ అతనికి అవకాశం దక్కలేదు. జట్టు మేనేజ్‌మెంట్ అభిప్రాయం ఏమిటన్న విషయాన్ని ఇదే అంశం స్పష్టం చేస్తున్నది.
యువీ స్థానం పదిలం!
జట్టులో యువరాజ్ సింగ్ స్థానం పదిలమని విశే్లషకుల అభిప్రాయం. ఆస్ట్రేలియా టూర్‌లో అతను రాణించాడు. 2011 వరల్డ్ కప్‌లో 15 వికెట్లు పడగొట్టి, బౌలింగ్‌లోనూ తాను ప్రతిభావంతుడినేనని నిరూపించుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా సేవలు అందించే అవకాశం ఉంది కాబట్టి యువీని జట్టు నుంచి తొలగించేందుకు సెలక్టర్లు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఆసీస్‌తో టి-20 సిరీస్ ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ధోనీ వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం జట్టులో భారీ మార్పులు ఉండకపోవచ్చు.
పరిశీలనలో పఠాన్ పేరు?
సయ్యద్ ముస్తాక్ అలీ టి-20 టోర్నీమెంట్‌లో అద్భుతంగా రాణించిన ఇర్ఫాన్ పఠాన్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. తరచు గాయాల బారిన పడే ఆశిష్ నెహ్రాకు స్టాండ్‌బైగా ఇర్ఫాన్‌ను తీసుకుంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. హార్దిక్ పాండ్య జట్టును కొనసాగే అవకాశాలున్నాయి. రవీంద్ర జడేజాకు కవర్‌గా జట్టులోకి వచ్చిన పవన్ నేగీ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రావడం లేదు. అక్షర్ పటేల్ ఫామ్‌లో లేడుకాబట్టి, నేగీ వైపు సెలక్టర్లు దృష్టి సారించినా ఆశ్చర్యం లేదు. కాగా, అశ్విన్‌కు కవర్‌గా కొనసాగుతూ వస్తున్న హర్భజన్ సింగ్‌కు శుక్రవారం నాటి సెలక్షన్‌లో సానుకూల స్పందన వస్తుందా అన్నది అనుమానమే. గాయాల నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్‌కు కూడా జట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయి.

బిసిసిఐ దూకుడుకు బ్రేక్!
దుబాయ్, ఫిబ్రవరి 4: ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ వ స్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దూ కుడుకు బ్రేక్ పడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శశాంక్ మనోహర్ ఆ ధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ కీలక నిర్ణయాలు తీసు కుంది. ఐసిసి ఆర్థిక వ్యవహారాలన్నీ బిసిసిఐ, క్రికెట్ ఆ స్ట్రేలియా (సిఎ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) పర్యవేక్షిస్తాయంటూ గతంలో తీసుకున్న నిర్ణ యాన్ని తప్పుపట్టింది. ఇకపై కేవలం మూడు క్రికెట్ బో ర్డులకు మాత్రమే ఆర్థిక పరమైన హక్కులు ఉండబోవని ఈ కమిటీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రతి రెండే ళ్లకోసారి ఎన్నికలను నిర్వహించి, ఆర్థిక లావాదేవీలపై నిర్ణయం తీసుకునే కమిటీలో సభ్యులుగా నియమించ డం జరుగుతుందని తెలిపింది.

బాస్కెట్‌బాల్‌పై వేటు
గౌహతి: బాస్కెట్‌బాల్ ఈవెంట్‌పై వేటు పడింది. శాగ్ క్రీడల నిర్వాహణలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదన్న కారణంగా బాస్కెట్‌బాల్ పోటీలకు సభ్య దేశాలు హాజరుకారాదని అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (్ఫబా) ప్రకటించింది. చివరి క్షణాల్లో ఈ నిర్ణయం వెలువడడంతో, ఏం చేయాలో అర్థంగాక నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, ఏదో ఒక రకంగా ఫిబాను ఒప్పిస్తామని వారు అంటున్నారు.

తిరుగులేని భారత్
గౌహతి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. 2010లో ఢాకాలో ఈ పోటీలు జరిగినప్పుడు 157 స్వర్ణ పతకాలకు పోటీ జరగ్గా, 90 పతకాలను భారత్ కైవసం చేసుకుంది. మొత్తం మీద 528 పతకాలకుగాను 175 పతకాలను సాధించి, తనకు తిరుగులేదని నిరూపించింది. 19 స్వర్ణాలసహా మొత్తం 80 పతకాలు సాధించిన పాకిస్తాన్‌కు రెండో స్థానం దక్కింది. మొదటి రెండు స్థానాల మధ్య ఉన్న భారీ తేడా భారత్ ఆధిక్యాన్ని నిరూపిస్తున్నది. ఈసారి 228 స్వర్ణం, 228 రజతం, 308 కాంస్య పతకాలకు పోటీలను నిర్వహిస్తారు. అథ్లెట్లు, అధికారులు, ఇతర సిబ్బంది కలిసి క్రీడా గ్రామాల్లో మొత్తం 3,333 మంది ఉంటారు.
శాగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పురుషులు, మహిళల విభాగాల్లో సమాన ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. అందుకే లింగ వివక్ష లేని గేమ్స్‌గా ఈ పోటీలను ప్రకటించారు. కాగా, ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ 521 మంది అథ్లెట్లను బరిలోకి దించుతున్నది. వీరిలో 245 మంది మహిళలు. నేపాల్ 381, బంగ్లాదేశ్ 370 మందిని పంపాయి. భారత్‌లో భద్రతా పరమైన అంశాలు తలెత్తుతాయన్న వాదనను తోసిపుచ్చిన పాకిస్తాన్ 346 మంది అథ్లెట్లను పంపింది.