క్రీడాభూమి

హై ఓల్టేజీ మ్యాచ్‌కి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటిసారి ఒక టెస్టు మ్యాచ్‌కి ముస్తాబైనప్పటికీ రాంచీలో పండుగ వాతావరణం కరవైంది. స్థానికుడైన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులో లేకపోవడమేకాదు.. కనీసం మ్యాచ్‌ని చూసేందుకు వచ్చే అవకాశం కూడా లేదన్న వార్తతో అభిమానులు నీరసపడిపోయారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆదరణ ఉన్నప్పటికీ, రాంచీలోని క్రికెట్ అభిమానులకు అతను ధోనీతో సరితూగడు. న్యూఢిల్లీలో విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో ధోనీ నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్ జట్టు సెమీ ఫైనల్ చేరింది. దీనితో అతను టెస్టు మ్యాచ్‌ని చూసేందుకు రాంచీ రాకపోవచ్చని సమాచారం. అందుకే, అభిమానుల్లో ఆశించినంత ఉత్సాహం కనిపించడంలేదు. అయితే, వీలు చూసుకొని అతను మ్యాచ్‌ని చూసేందుకు తప్పక వస్తాడని భారత కోచ్ అనీల్ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేయడం వారికి ఆశాకిరణమైంది.

రాంచీ, మార్చి 15: నాలుగు టెస్టుల సురీస్‌లో చెరొక మ్యాచ్‌ని గెల్చుకొని సుమవుజ్జీలుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. మొదటిసారి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (జెఎస్‌సిఎ) మైదానం తీరు ఏ విధంగా ఉంటుందోనన్న విషయంపై ఇరు జట్లకు స్పష్టమైన అవగాహన లేదు. అయితే, ఇక్కడ వనే్డ ఇంటర్నేషనల్స్, ఐపిఎల్‌సహా వివిధ సిరీస్‌లు, టోర్నీల్లో ఇక్కడ మ్యాచ్‌లు ఆడిన అనుభవం భారత ఆటగాళ్లకు ఉంది. ఈ విషయంలో ఆసీస్ కంటే టీమిండియా పరిస్థితి కొంత మెరుగు. పుణేలో జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్ బెంగళూరులో ఎదురుదాడికి దిగి, ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లోనే ఇరు జట్ల కెప్టెన్లు, విరాట్ కోహ్లీ, స్టువెన్ స్మిత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పెనుతుపానుగా మారే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, రెండు దేశాల క్రికెట్ బోర్డులు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. కానీ, ఏ క్షణంలోనైనా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ చెలరేగే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రక్రియ ‘సెడ్జింగ్’లో ఆస్ట్రేలియా క్రికెటర్లును మించినవారు లేరు. అయితే, ఇప్పుడు టీమిండియా కూడా మాటకుమాట చెప్తున్నది. మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ టెస్టు జట్టుకు నాయకత్వ బాధ్యతలు స్వీరకించిన తర్వాత టీమిండియా తీరు ఒక్కసారిగా మారిపోయింది. జట్టులోని ఆటగాళ్లంతా కోహ్లీ బాటనే అనుసరిస్తున్నారు. భారత జట్టు ఈ విధంగా ఎదురు తిరుగుతుందని ఊహించని ఆసీస్ క్రికెటర్లకు డిఆర్‌ఎస్ వివాదం వాస్తవాన్ని కళ్లకు కట్టింది. స్లెడ్జింగ్ లేదా ఇతరత్రా అవాంఛిత మార్గాలను అనుసరించకుండా, ఇరు జట్లు క్రీడాస్ఫూర్తితో ఆడితేనే మ్యాచ్ రక్తికడుతుంది.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు, జెఎస్‌సిఎ మైదానం పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు అందుబాటులో రాకముందు, అక్కడి అభిమానులకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానమే స్వర్గ్ధామంగా ఉండేది. పదహారేళ్ల క్రితం, మార్చి 15వ తేదీ నాడే ఆస్ట్రేలియాను టీమిండియా అనూహ్యంగా చిత్తుచేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆసీస్ ఆతర్వాత భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకే ఆలౌట్ చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫాలోఆన్‌కు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగింది. వివిఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) ఐదో వికెట్‌కు 276 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో, భారత్ 657 పరుగులు సాధించింది. 384 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 212 పరుగులకు కుప్పకూలింది. హర్భజన్ సింగ్ 73 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, భారత్‌కు 2001 మార్చి 15వ తేదీన 171 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటై, అదే తేడాతో మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

జెఎస్‌సిఎ మైదానం పిచ్‌ను పరిశీలిస్తున్న భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే