క్రీడాభూమి

రంజీ ట్రోఫీ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పటిష్టమైన బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మధ్య ప్రదేశ్ (ఎంపి) చేతిలో ఏకంగా 355 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. అసాధ్యంగా కనిపిస్తున్న 788 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజైన ఆదివారం మూడు వికెట్లకు 113 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన బెంగాల్ 432 పరుగులకు ఆలౌటైంది. మనోజ్ తివారీ (124), పంకజ్ షా (118) సెంచరీలు సాధించినా, జట్టును లక్ష్యానికి చేర్చడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మధ్య ప్రదేశ్ జట్టు 348 పరుగులు చేసింది. ఆదిత్య శ్రీవాత్సవ 65, నమన్ ఓఝా 64, దేవేంద్ర బుందేలా 58, హర్పీత్ సింగ్ 51 చొప్పున పరుగులు సాధించారు. బెంగాల్ బౌలర్లలో వీర్ ప్రతాద్ సింగ్ 76 పరుగులకు ఐదు, అశోక్ దిండా 85 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అభిమన్యు ఈశ్వరన్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంపి బౌలర్ ఈశ్వర్ పాండే 45 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. పునీత్ డటీ 30 పరుగులకు మూడు, చంద్రకాంత్ సకూరే 38 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఎంపి జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 560 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 788 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రజత్ పటీదార్ 137, నమన్ ఓఝా 52, దేవేంద్ర బుందేలా 75, హర్‌ప్రీత్ సింగ్ 139, అంకిత్ డోన్ 69 పరుగులు సాధించారు.
విజయానికి 788 పరుగులు సాధించాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో వీరోచితంగా పోరాడింది. మనోజ్ తివారీ, పంకజ్ షా శతకాలు నమోదు చేయగా, అశోక్ దిండా (52) అర్ధ శతకాన్ని సాధించాడు. మొత్తం మీద 432 పరుగులు చేసిన ఎంపి ఆలౌట్‌కాగా, బెంగాల్ బౌలర్లలో ఈశ్వర్ పాండే 93 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. చంద్రకాంత్ సకురా 114 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. జలజ్ సక్సేనా 96 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇతర క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో విదర్భపై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో గెలిచింది. జార్ఖండ్‌ను ముంబయి 395 పరుగుల తేడాతో ఓడించింది. అస్సాం 51 పరుగుల ఆధిక్యంతో పంజాబ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

అండర్-19 ప్రపంచ కప్
సెమీ ఫైనల్‌కు లంక
మీర్పూర్, ఫిబ్రవరి 7: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ చేరింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న ఈ జట్టు ఫైనల్‌లో స్థానం కోసం భారత్‌ను ఢీకొననుంది. లంక జట్టు సెమీస్ చేరడం ఇది మూడోసారి. 2000లో మొదటిసారి సెమీ ఫైనల్ చేరినప్పుడు మహమ్మద్ కైఫ్ నాయకత్వంలోని భారత్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. 2010లో మరోసారి సెమీస్ చేరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ టోర్నీలో లంక నాలుగో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కాగా, ఆదివారం నాటి క్వార్టర్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కల్లమ్ టేలర్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బెన్ గ్రీన్ 26, జార్జి బార్ట్‌లెట్ 25, శామ్ కరన్ 25 చొప్పున పరుగులు సాధించారు. లంక బౌలర్లలో వానిదు హసరుగ డిసిల్వ 39 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. అశిత ఫెర్నాండో 16 పరుగులకే రెండు వికెట్లు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 35.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి, ఆరు పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఆవిష్క ఫెర్నాండో 95 పరుగులు సాధించి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. చారిత్ అశలన్క 34 పరుగులు చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 49.2 ఓవర్లలో ఆలౌట్ 184 (కల్లమ్ టేలర్ 42, బెన్ గ్రీన్ 26, వనిదు హసరుగ డి సిల్వ 3/39, అశిత ఫెర్నాండో 2/16).
శ్రీలంక ఇన్నింగ్స్: 35.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 (ఆవిష్క ఫెర్నాండో 95, చరిత్ అసలంక 34).

ఉత్కంఠ పోరులో జైపూర్ గెలుపు
కోల్‌కతా, ఫిబ్రవరి 7: ప్రో కబడ్డీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39-34 తేడాతో విజయం సాధించింది. చి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ కెప్టెన్ నవ్‌నీత్ గౌ తం, ఢిల్లీ నాయకుడు కషిలింగ్ అడాకెర్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఆరం భం నుంచి చివరి వరకూ ఇరు వర్గాలు విజయమే లక్ష్యంగా పోరాటం సాగిం చారు. ఒక్కో పాయంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దీనితో ఎవరు గె లుస్తారన్నది ఉత్కంఠగా మారింది. జైపూర్ ఐదు పాయంట్ల తేడాతో గెలిచి, ప్రో కబడ్డీలో ఒక అద్భుతమైన మ్యాచ్‌తో ప్రేక్షకులకు అందించింది. ఇలావుం టే, అంతకు ముందు జరిగిన మరో మ్యాజ్‌లో పునేరీ పల్టన్ జట్టుపై బెంగా ల్ వారియర్స్ జట్టు 33-28 తేడాతో గెలిచింది.

ప్రో కుస్తీలో సంగ్రామ్ బోణీ
మొహాలీ, ఫిబ్రవరి 7: ప్రో కుస్తీలో భారత అంతర్జాతీయ రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బోణీ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్, భారత సంప్రదాయ మల్లయుద్ధం మేలి కలయికగా రూపుదిద్దుకున్న ప్రో కుస్తీ మొదటి మ్యాచ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అమెరికా రెజ్లర్ రోబీపై సంగ్రామ్ హోరాహోరీగా పోరాడాడు. మొదటి నాలుగు రౌండ్లలో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్న సంగ్రామ్ ఐదో రౌండ్‌లో అద్వితీయ ప్రతిభ చూపాడు. రూబీని నాకౌట్ చేసి, ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేశాడు.

హాకీ ఇండియా లీగ్
కళింగపై పంజాబ్ గెలుపు
మీర్పూర్, ఫిబ్రవరి 7: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఆదివారం కళింగ లాన్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌ని జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు 4-1 తేడాతో గెల్చుకుంది. మ్యాజ్ ఆరంభం నుంచి దాదాపు చివరి వరకూ ఇరు జట్లు రక్షణాత్మ విధానాన్ని అనుసరించడంతో ఎలాంటి ఉత్సాహం లేకుండా సాగింది. చి వరి క్వార్టర్‌లో గోల్స్ నమోదయ్యాయ. 42వ నిమిషంలో గ్లేన్ టర్నర్ గోల్ చేసి కళింగ తరఫున ఖాతాను తెరిచాడు. అయతే, మరో ఆరు నిమిషాల్లోనే కీల్ బ్రౌన్ ద్వారా పంజాబ్‌కు ఈక్వెలై జర్ లభించింది. అది ఫీల్డ్ గోల్ కావడంతో నిబంధన ప్రకారం ఆ జట్టు బోనస్ పాయంట్ దక్కింది. 58వ నిమిషంలో సత్బీర్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ చేశాడు. దీనితో పంజాబ్‌కు రెండో బో నస్ గోల్ లభించి, 4-1 తేడాతో గెలిచింది.

లంకను ఓడిస్తేనే భారత్ నంబర్ వన్
దుబాయ్, ఫిబ్రవరి 7: శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయం సాధిస్తేనే టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి, ఏడు స్థానాలను అధిగమించిన టీమిండియా ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంది. అయితే, శ్రీలంకతో జరిగే సిరీస్ ఆ జట్టుకు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కీలకం కానుంది. సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకుంటే, భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నంబర్ వన్‌గా కొనసాగుతుంది. ఒకవేళ 2-1 తేడాతో విజయం సాధిస్తే, భారత్ అతి కష్టం మీద అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక నాలుగో స్థానానికి చేరుతుంది. ఒకవేళ శ్రీలంక 3-0 తేడాతో గెలిస్తే, మహేంద్ర సింగ్ నాయకత్వంలోని టీమిండియా మొదటి నుంచి ఏకంగా ఏడో స్థానానికి పడిపోతుంది.