క్రీడాభూమి

మహిళల క్రికెట్ మిథాలీ సూపర్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్: కెప్టెన్ మిథాలీ రాజ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్‌ను వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆమె 89 పరుగులు చేసి, భారత్‌కు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. అయితే, మొదటి రెండు వనే్డల్లో విజయాలను అందుకున్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి వనే్డలో తొలుత బ్యాటిగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళలు 50 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేశారు. అలెక్స్ బ్లాక్‌వెల్ 60, ఎలైస్ పెర్రీ 50 పరుగులు సాధించగా, నారత బౌలర్ శిఖా పాండే 50 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న మిథాలీ రాజ్ 89 పరుగులు సాధించింది. ఎలిస్ పెర్రీ 50 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చినా, ఆసీస్ బౌలింగ్ భారత్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 231 (అలెక్స్ బ్లాక్‌వెల్ 60, ఎలిస్ పెర్రీ 50, శిఖా పాండే 3/50).
భారత్ ఇన్నింగ్స్: 47 ఓవర్లలో 5 వికెట్లకు 234 (మిథాలీ రాజ్ 89, ఎలిస్ పెర్రీ 2/50).