క్రీడాభూమి

చివరి రోజూ అదే తంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 20: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చివరి రోజున కూడా యుద్ధ పూర్వక వాతావరణం నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కలహించుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ మాట్ రెన్‌షాను చిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తూ హేళన చేసిన భారత పేసర్ ఇశాంత్ శర్మ మరోసారి అతనితో కయ్యానికి కాలుదువ్వాడు. ఇశాంత్ బౌలింగ్ లైనప్ మొదలుపెట్టిన తర్వాత, సైడ్‌స్క్రీన్‌ను ఎడ్జెస్ట్ చేయాల్సిందిగా అధికారులక, అంపైర్‌కు సూచిస్తూ హ్యాండ్స్‌కోమ్ క్రీజ్ నుంచి బయటకు వచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే అతను బంతి వేయకుండా తనను ఆపేశాడని ఇశాంత్ అనుమానించాడు. ఈ క్రమంలోనే హ్యాండ్‌కోమ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆతర్వాత రెట్టించిన కోపంతో అతను మెరుపు వేగంతో వేసిన బంతి హ్యాండ్స్‌కోమ్ కాలికి బలంగా తగిలింది. తర్వాతి బంతి ఎవరూ ఊహించని రీతిలో పైకి ఎగిసి, హెల్మెట్‌కు ఉన్న గ్రిస్ కింది నుంచి దూసుకెళ్లి హ్యాండ్స్‌కోమ్ దవడకు తగిలింది. దీనితో ఏకాగ్రత కోల్పోయిన హ్యాండ్స్‌కోమ్ తర్వాతి బంతిలోనే ఎల్‌బిగా అవుటయ్యాడు.
రెచ్చిపోయిన కోహ్లీ..
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి రోజు మైదానంలో రెచ్చిపోయాడు. పదేపదే అప్పీల్స్ చేస్తూ, ఆసీస్ బ్యాట్స్‌మెన్ అవుటైనప్పుడు తీవ్రంగా స్పందిస్తూ, స్లెడ్జింగ్‌లో తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించాడు. నాలుగో రోజు ఆటలో కుడి భుజాన్ని ఎడమ చేత్తో పట్టుకొని ఆసీస్ ఆటగాడు గ్లేన్ మాక్స్‌వెల్ తనను వెక్కిరించిన తీరు కోహ్లీ ఆగ్రహానికి కారణమైంది. చివరి రోజు ఆటలో డేవిడ్ వార్నర్ అవుటైనప్పుడు ‘నోరు మూసుకొని వెళ్లు’ అన్న రీతిలో నోటిపై వేలేసుకొని అతనికి పెవిలియన్ దారి చూపించాడు. రెండు జట్ల మధ్య ఘర్షణ రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు.
* ఆస్ట్రేలియా 2004 తర్వాత మొదటిసారి తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి, మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఓటమి నుంచి బయటపడేందుకు ఈ జట్టు 100 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఎదుర్కోవడం 2004లో జరిగిన చెన్నై టెస్టు తర్వాత ఇదే తొలిసారి.
* మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో రాణించిన భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతను తన టెస్టు కెరీర్‌లో నాలుగోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించాడు. ఆస్ట్రేలియాపై అతనికి ఇది రెండోసారి. 2013 మార్చిలో, హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో 204 పరుగులు సాధించినప్పుడు అతనికి ఆసీస్‌పై మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
* డ్రాగా ముగిసిన టెస్టుల్లో పుజారా సగటు 55.07 పరుగులు. మొత్తం 14 ఇన్నింగ్స్ ఈ విధంగా డ్రాకాగా, పుజారా 771 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఒక అర్ధ శతకం ఉన్నాయి.

చిత్రాలు..విరాట్ కోహ్లీ *ఇశాంత్ శర్మ